మళ్లీ వాయిదా పడనున్న నాగ చైతన్య లవ్ స్టోరీ..!

August 26, 2021 6:49 PM

అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “లవ్ స్టోరీ”. ఈ సినిమా షూటింగ్ మొత్తం కరోనా రెండవ దశ కంటే ముందుగానే పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ సినిమా కరోనా కారణం చేత వాయిదా పడింది. ఈ క్రమంలోనే థియేటర్లు తెరుచుకోవడంతో ఈ సినిమా విడుదల చేయడానికి నిర్వాహకులు అన్ని ఏర్పాట్లను చేశారు. నాగచైతన్య లవ్ స్టోరీ సినిమాను వినాయక చవితి పండుగ సందర్భంగా సెప్టెంబర్ 10వ తేదీన థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

అయితే తాజాగా మరోసారి ఈ సినిమా విడుదల తేదీని వాయిదా వేసినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 10వ తేదీన ఓటీటీలో నాని నటించిన “టక్ జగదీష్” చిత్రం విడుదల కానుంది, అదేవిధంగా 9వ తేదీ నితిన్‌ నటించిన “మాస్ట్రో” డిస్నీ హాట్‌స్టార్‌లో ప్రసారం కానుంది. ఇక కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ నటించిన తలైవి సినిమా 10వ తేదీన విడుదల కావడంతో లవ్ స్టోరీ సినిమా విడుదల తేదీని వాయిదా వేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే వరుస సినిమాలన్నీ ఓటీటీ వేదికగా విడుదల కావడంతో నాగచైతన్య లవ్ స్టోరీ సినిమా విడుదల తేదీని మరోసారి వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే తిరిగి ఈ సినిమాను సెప్టెంబర్ 17 వ తేదీన విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఓటీటీలో ఏవైనా చిత్రాలు వాటి విడుదల తేదీని వాయిదా వేసుకుంటే లవ్ స్టోరీ సినిమా విధిగా 10వ తేదీనే విడుదల చేయాలనే ఆలోచనలో చిత్రబృందం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now