అమెరికన్ మాన్‌స్టర్ ఫిలిం గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ మార్చి 25వ తేదీన విడుదలైన సంగతి తెలిసిందే. గాడ్జిల్లా, కాంగ్ సిరీస్‌లో వచ్చిన నాలుగో మూవీ ఇది. గాడ్జిల్లా, కాంగ్ – స్కల్ ఐల్యాండ్, గాడ్జిల్లా – కింగ్ ఆఫ్ మాన్‌స్టర్స్ తరువాత వచ్చిన మూవీ ఇది. ఈ క్రమంలోనే ఈ మూవీ మన దేశంలో బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లనే రాబడుతోంది. వీకెండ్ సమయంలో ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. కోవిడ్ భయం ఉన్నప్పటికీ ప్రేక్షకులు ఈ మూవీని చూసేందుకు థియేటర్లకు వెళ్తుండడం విశేషం.
గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ మూవీ తొలి 5 రోజుల్లో రూ.28.96 కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్లను సాధించింది. వారాంతాల్లోనే దాదాపుగా రూ.13 కోట్ల వరకు కలెక్షన్లు రావడం విశేషం. అయితే పలు ప్రాంతాల్లో కోవిడ్ రూల్స్ లేకపోతే ఇంకా ఎక్కువ కలెక్షన్లు వచ్చి ఉండేవి అని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మొత్తం మీద గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ మూవీ భారతీయ ప్రేక్షకులను అలరిస్తుందని చెప్పవచ్చు. అయితే ఉత్తర భారతం కంటే దక్షిణ భారతంలోనే ఈ మూవీని ప్రేక్షకులు ఆదరిస్తున్నారని తెలిసింది.
గాడ్జిల్లా మూవీ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లలో ఎక్కువ కలెక్షన్లను రాబట్టింది. కేరళలోనూ ఒక మోస్తరుగా ఆదరణ లభిస్తోంది. అయితే హిందీలో ఈ మూవీకి పెద్దగా ఆదరణ లభించడం లేదు. కరోనా ప్రభావం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని తెలుస్తోంది. అయినప్పటికీ ఓవరాల్‌గా చూస్తే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచిందని విశ్లేషకులు చెబుతున్నారు.
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…
మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వారణాసి చిత్ర షూటింగ్‌ను ప్రస్తుతం జూనియర్ ఎన్‌టీఆర్…
రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది మూవీ విడుదల మరోసారి వాయిదా పడింది. మూవీ అనుకున్న తేదీ ప్రకారమే రిలీజ్…
తాను సినిమాల్లో నటించిన సమయంలో తన దుస్తులను తానే డిజైన్ చేసుకుని ధరించే దాన్నని నటి రేణు దేశాయ్ తెలిపారు.…
మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేనని నిర్మాత సుప్రియ యార్లగడ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీలకమని, ఇప్పుడు ప్రేక్షకులు…