మెగాస్టార్ తొలి హాలీవుడ్ మూవీ.. అబు, బాగ్దాద్ గ‌జ దొంగ ఎందుకు ఆగిపోయిందో తెలుసా..?

June 11, 2021 2:06 PM

మెగాస్టార్ చిరంజీవి సినిమా వ‌స్తుందంటే చాలు.. అభిమానుల్లో ఎంతో ఉత్సాహం నెల‌కొంటుంది. ఆయ‌న సినిమా ఎప్పుడు విడుద‌ల అవుతుందా ? అని వారు ఆతృత‌గా ఎదురు చూస్తుంటారు. అలాంటిది ఆయన హాలీవుడ్ చిత్రంలో న‌టిస్తే ఎలా ఉంటుంది ? అభిమానుల్లో ఇంకా అంచ‌నాలు భారీగా పెరిగిపోతాయి క‌దా. అవును. అయితే ఆయ‌న‌కు ఆ అవ‌కాశం వ‌చ్చింది కానీ.. ఆ సినిమా షూటింగ్ మ‌ధ్య‌లోనే ఆగిపోయింది. ఇంత‌కీ ఏంటా సినిమా ? అంటే..

do you know why abu bagdad gajadonga movie stopped

1998లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా అబు బాగ్దాద్ గ‌జ‌దొంగ అనే మూవీని ప్రారంభించారు. అప్ప‌ట్లో రూ.5 కోట్లు పెట్ట‌డ‌మే ఎక్కువ‌. అలాంటిది రూ.50 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో మూవీని ప్రారంభించారు. గ్రాండ్‌గా ఓపెనింగ్ కూడా అయింది. దీన్ని ఒకేసారి తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాష‌ల్లో తెర‌కెక్కించారు. ఇంగ్లిష్ వెర్ష‌న్‌కు డుషాన్ జ‌ర్సి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా, తెలుగు, హిందీ వెర్ష‌న్ల‌కు సురేష్ కృష్ణ‌ను ద‌ర్శ‌కుడిగా తీసుకున్నారు. ఏఆర్ రెహ‌మాన్‌ను సంగీత ద‌ర్శ‌కుడిగా ఎంపిక చేశారు. అయితే అనుకోని కార‌ణాల వ‌ల్ల ఈ సినిమా షూటింగ్ మ‌ధ్య‌లోనే ఆగిపోయింది.

ఈ మూవీలో కొన్ని స‌న్నివేశాలు అభ్యంత‌ర‌క‌రంగా ఉన్నాయంటూ కొంద‌రు కోర్టుల‌కెక్కారు. ముస్లింలు ప‌విత్రంగా భావించే ఖురాన్ పేప‌ర్ల‌ను టీ క‌ప్పులో ముంచే సీన్ ఒక‌టి ఉంది. దీంతో ఈ మూవీ షూటింగ్‌ను నిలిపివేయాల‌ని సౌదీతోపాటు ప‌లు ఇత‌ర దేశాల్లోని వారు కోర్టుల్లో కేసులు వేశారు. దీంతో ఈ మూవీ షూటింగ్‌ను ఆపేయాల‌ని కోర్టులు తీర్పులు చెప్పాయి. అలాగే ఈ మూవీకి చెందిన ఓ పోస్ట‌ర్‌లో సూర్య భ‌గ‌వానుడికి 9 ర‌థాలు ఉన్న‌ట్లు చూపించారు. కానీ హిందూ మ‌తం ప్ర‌కారం సూర్యుడికి 7 ర‌థాలే ఉంటాయి. ఇది కూడా వివాదానికి దారి తీసింది. ఈ క్ర‌మంలో కొంద‌రు దీనిపై కోర్టుకెక్క‌గా కోర్టు మూవీ షూటింగ్‌ను ఆపేయ‌మ‌ని చెప్పింది. అలా తెలుగు, హిందీ భాష‌ల్లోనూ ఈ మూవీ ఆగిపోయింది.

అయితే ఇదే మూవీ గ‌న‌క అప్ప‌ట్లో వ‌చ్చి ఉంటే బాహుబ‌లి సాధించిన రికార్డులు అప్ప‌ట్లోనే ఈ మూవీ సాధించి ఉండేద‌ని విశ్లేష‌కులు ఇప్ప‌టికీ చెబుతుంటారు. ఏది ఏమైనా హాలీవుడ్‌లో అడుగు పెట్టాల‌ని తొలిసారిగా చిరంజీవి చేసిన ప్ర‌య‌త్నం అలా దెబ్బ తిన్న‌ది. దీంతో ఆయ‌న ఎంతో నిరుత్సాహానికి గుర‌య్యార‌ట‌.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment