రష్మిక కోసం 900 కి.మీ ప్రయాణించిన అభిమాని.. చివరికి?

June 26, 2021 5:14 PM

టాలీవుడ్లో ప్రస్తుతం సుకుమార్‌-బన్నీ కాంబినేషన్‌లో తెరకెక్కతున్న పాన్‌ ఇండియా మూవీ “పుష్ప” లో రష్మిక హీరోయిన్‌గా నటిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. రష్మిక మందన నాగశౌర్య హీరోగా నటించిన “చలో” మూవీ ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది. తరువాత గీతాగోవిందం, సరిలేరు నీకెవ్వరు, భీష్మ వంటి బ్లాక్ బస్టర్ మూవీలతో తెలుగు ఇండస్ట్రీలో విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకుంది.

కన్నడ బ్యూటీ రష్మిక సౌత్ ఇండియాలో అగ్ర కథానాయికగా కొనసాగుతూ అత్యధిక అభిమానులను సొంతం చేసుకున్న హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా హైదరాబాద్ కు చెందిన ఓ అభిమాని రష్మికను కలవడానికి ఏకంగా 900 కిలోమీటర్లు ప్రయాణం చేసి వెళ్ళాడట. వివరాల్లోకి వెళితే. రష్మికకు వీరాభిమాని అయినా ఆకాశ్‌ త్రిపాఠి హైదరాబాద్ కు చెందిన వ్యక్తి .ఈయన తన అభిమాన హీరోయిన్ ను ఒక్కసారైనా కలిసి మాట్లాడాలని భావించి తన ప్రయాణాన్ని మొదలు పెట్టాడు.

ఆ అభిమాని గూగుల్ ద్వారా రష్మిక స్వస్థలం కర్ణాటకలోని కొడగు సమీపంలోని విరాజ్‌పేట అని తెలుసుకున్నాడు. రైల్లో మైసూరుకు చేరుకొని అక్కడినుంచి ఏదో ఒక వెహికల్ పట్టుకొని రష్మిక స్వస్థలానికి చేరుకున్నాడు. అయితే అక్కడికి చేరుకున్నాక హీరోయిన్ రష్మిక ఇల్లు ఎక్కడ అంటూ కనిపించిన ప్రతి ఒక్కరిని అడిగాడు. అతడి ప్రవర్తన తేడాగా అనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అతన్ని విచారించగా అసలు ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశాడు ఆ అభిమాని. ఈ విషయం విన్న పోలీసులు రష్మిక ప్రస్తుతం పలు సినిమాల షూటింగ్ కోసం ముంబై వెళ్లినదని చెప్పి అతనిని వెనుతిరిగి పంపించారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment