బిజినెస్ ఐడియాలు

ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఫ్యాష‌న్ ఉత్ప‌త్తుల విక్ర‌యం.. నెల‌కు రూ.80వేలు సంపాదిస్తున్న మ‌హిళ‌..

క‌రోనా ప్ర‌భావం వ‌ల్ల ఎంతో మంది ఉద్యోగాల‌ను, ఉపాధిని కోల్పోయారు. ఈ క్ర‌మంలో వారు మ‌ళ్లీ ఉపాధి పొంద‌డం క‌ష్టంగా మారింది. అయితే అలాంటి స్థితిలో ఉన్న‌ప్ప‌టికీ ఆ మ‌హిళ చాలా తెలివిగా ఆలోచించింది. క‌రోనా వ‌ల్ల అంతా ఆన్‌లైన్‌లోనే జ‌రుగుతోంది. క‌నుక తాను కూడా ఆన్‌లైన్‌లోనే బిజినెస్ చేయాల‌నుకుంది. వెంట‌నే ఆ ఆలోచ‌న‌ను అమ‌లు చేసింది.

రాజ‌స్థాన్‌లోని అమ‌రావ‌తి అనే ప్రాంతానికి చెందిన భావ‌న మ‌నోజ్ దేశ్వానిది బోటిక్ బిజినెస్‌. కుటుంబంలో అంద‌రూ క‌ల‌సి క‌ట్టుగా ఆ వ్యాపారం చేస్తారు. అంద‌రూ ప‌నిచేస్తారు. ఇక భావ‌న చ‌క్క‌ని ఎంబ్రాయిడరీ డిజైన్లు చేస్తుంది. అయితే కోవిడ్ వ‌ల్ల లాక్‌డౌన్‌ల‌ను అమ‌లు చేస్తుండ‌డంతో వారి వ్యాపారం బాగా డౌన్ అయింది. తీవ్ర‌మైన న‌ష్టాలు వ‌చ్చాయి. కానీ భావ‌న ఆలోచ‌న‌తో వారు మ‌ల్లీ విజ‌య‌వంతంగా వ్యాపారం చేయ‌డం మొద‌లు పెట్టారు. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతాను ఓపెన్ చేసి అందులో త‌మ ఫ్యాష‌న్ ఉత్ప‌త్తుల‌ను విక్ర‌యించ‌డం ప్రారంభించింది.

మొద‌ట్లో అందులో మాస్కుల‌ను త‌యారు చేసి అమ్మేవారు. అవి చ‌క్క‌ని డిజైన్ల‌లో ఉండ‌డంతో మంచి ఆద‌ర‌ణ ల‌భించింది. దీంతో వారు మాస్కుల‌తోపాటు హెయిర్ యాక్స‌స‌రీలు, దుస్తులు, డ్రెస్సులు, కుర్తీలు, చిన్నారుల దుస్తులు త‌దిత‌ర ఫ్యాష‌న్ ఉత్ప‌త్తుల‌ను కుట్టి, వాటికి చ‌క్క‌ని డిజైన్లు చేసి అమ్మ‌డం మొద‌లు పెట్టారు. క్ర‌మంగా వారు ప్ర‌గ‌తిని సాధించారు.

భావ‌న కుటంబం ఇప్పుడు నెల‌కు రూ.80వేల వ‌ర‌కు సంపాదిస్తోంది. ఇన్‌స్టాగ్రామ్ ద్వారానే ఇక‌పై ఉత్ప‌త్తుల‌ను అమ్ముతామ‌ని చెబుతోంది. ఓ కొరియ‌ర్ సంస్థ‌తో ఆమె ఒప్పందం చేసుకుంది. దీంతో వారు త‌మ ఉత్ప‌త్తుల‌ను దేశం మొత్తం ఎక్క‌డికైనా స‌రే డెలివ‌రీ చేస్తున్నారు. అలా వారు కొద్ది నెలల్లోనే స‌క్సెస్ సాధించారు. తీవ్ర‌మైన స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌తం అవుతున్న‌వారు, స్వ‌యం ఉపాధి, ఉద్యోగాలు కోల్పోయిన వారు ఈ విధంగా భావ‌న లాగా ప్ర‌య‌త్నిస్తే ఏదో ఒక ఉపాధి పొంది ఆర్థిక స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వచ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM

‘దేవర’ సెట్స్‌లో మహేష్ బాబు ‘వారణాసి’ షూటింగ్.. రాజమౌళి నిర్ణయం వెనుక అసలు కారణం ఇదే!

మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న వార‌ణాసి చిత్ర షూటింగ్‌ను ప్ర‌స్తుతం జూనియ‌ర్ ఎన్‌టీఆర్…

Thursday, 16 April 2026, 3:36 PM

మళ్ళీ వాయిదా పడ్డ రామ్ చరణ్ ‘పెద్ది’.. జూన్‌కు వెళ్ళిన మెగా మూవీ! కారణం ఏంటంటే?

రామ్ చ‌రణ్ హీరోగా న‌టిస్తున్న పెద్ది మూవీ విడుద‌ల‌ మ‌రోసారి వాయిదా ప‌డింది. మూవీ అనుకున్న తేదీ ప్ర‌కార‌మే రిలీజ్…

Thursday, 16 April 2026, 11:18 AM

‘బద్రి’లో నా దుస్తులు నేనే డిజైన్ చేసుకున్నా.. రేణు దేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

తాను సినిమాల్లో న‌టించిన స‌మ‌యంలో త‌న దుస్తుల‌ను తానే డిజైన్ చేసుకుని ధ‌రించే దాన్న‌ని న‌టి రేణు దేశాయ్ తెలిపారు.…

Wednesday, 15 April 2026, 5:58 PM

రిస్క్ చేస్తేనే మంచి సినిమా.. ‘డెకాయిట్’ క్లైమాక్స్‌పై నిర్మాత సుప్రియ ఆసక్తికర వ్యాఖ్యలు!

మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేన‌ని నిర్మాత సుప్రియ యార్ల‌గ‌డ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీల‌క‌మ‌ని, ఇప్పుడు ప్రేక్ష‌కులు…

Tuesday, 14 April 2026, 7:27 PM

ఐపీఎల్ జట్టు ఎందుకు కొనలేదు? అసలు నిజం చెప్పిన అభిషేక్ బచ్చన్.. అంత బడ్జెట్ నా దగ్గర లేదు!

నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్‌బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…

Tuesday, 14 April 2026, 5:35 PM

పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఓటీటీ డేట్ ఫిక్స్.. ఎక్కడ, ఎప్పటి నుంచి అంటే?

ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధ‌మైంది. ఈ…

Tuesday, 14 April 2026, 3:21 PM

పాత ఫ్లాపులని గుర్తు చేస్తూ ట్రోల్ చేస్తే బాధగా ఉంటుంది.. కృతి శెట్టి ఎమోషనల్ కామెంట్స్!

తాను గ‌తంలో చేసిన సినిమాలు చాలా వ‌ర‌కు ఫ్లాప్ అయ్యాయి క‌నుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…

Saturday, 11 April 2026, 8:35 PM