చిరంజీవి, నాగబాబు నా అన్నయ్యలే.. ఇన్‌స్టా ఎంట్రీతో అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి, సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ భార్య అన్నా లెజినోవా బ‌య‌ట చాలా అరుదైన సందర్భాల్లో క‌నిపిస్తార‌న్న విష‌యం తెలిసిందే. సోష‌ల్ మీడియాలోనూ పెద్ద‌గా యాక్టివ్‌గా ఉండ‌రు. అయితే తాజాగా ఆమె పెట్టిన పోస్టు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్‌గా మారింది.

March 26, 2026 6:09 PM
Anna Lezhneva's first Instagram post about Chiranjeevi and Naga Babu.
‘అన్నా కొణిదెల’ పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతా తెరిచిన పవన్ కల్యాణ్ భార్య అన్నా లెజినోవా. Photo Credit: Anna Lezhneva/Instagram.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి, సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ భార్య అన్నా లెజినోవా బ‌య‌ట చాలా అరుదైన సందర్భాల్లో క‌నిపిస్తార‌న్న విష‌యం తెలిసిందే. సోష‌ల్ మీడియాలోనూ పెద్ద‌గా యాక్టివ్‌గా ఉండ‌రు. అయితే తాజాగా ఆమె పెట్టిన పోస్టు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్‌గా మారింది. ఆమె చిరంజీవి, నాగ‌బాబుల‌తో త‌న‌కు ఉన్న అనుబంధం గురించి ఆ పోస్టులో వివ‌రించారు. ఇటీవ‌లే ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతా తెరిచిన ఆమె అందులో పోస్టు పెట్టారు. దాంట్లో మెగా ఫ్యామిలీ గురించి ప‌లు విష‌యాల‌ను ఆమె వెల్ల‌డించారు. చిరంజీవి, నాగ‌బాబు వ‌రుస‌కు బావ‌లే అయినా ఆమె సోద‌రుల‌తో స‌మానంగా భావిస్తాన‌ని చెప్పారు.

ప‌వ‌న్ ఎలా పిలిస్తే అలా పిలిచేదాన్ని: అన్నా

అన్నా లెజినోవా త‌న పోస్టులో అన్న‌య్య‌నా.. బావ‌గారా..? అని రెండు ఫొటోల‌ను పోస్ట్ చేశారు. అందులో ఒక దాంట్లో ఆమె ప‌వ‌న్‌, చిరంజీవితో క‌ల‌సి ఉండ‌గా, చిరు ఆమెను గారాబం చేస్తున్న‌ట్లు క‌నిపిస్తోంది. ఇక మ‌రో ఫొటోలో ఆమె నాగ‌బాబుతో ఉన్నారు. అయితే మెగా ఫ్యామిలీలో తాను గత 15 ఏళ్ల కింద‌ట అడుగు పెట్టాన‌ని, ఈ కుటుంబంలో ఎప్పుడూ ఒక‌రిపై ఒక‌రు ప్రేమానురాగాలు చూపిస్తార‌ని ఆమె తెలిపారు. తాను ఈ ఫ్యామిలీలోకి వ‌చ్చిన కొత్త‌ల్లో ఇక్క‌డ ఎలా ఉండాలో, ఎవ‌రిని ఎలా పిల‌వాలో అర్థం కాలేద‌ని, దీంతో త‌న భ‌ర్త ప‌వ‌న్ వారిని ఎలా పిలుస్తున్నారో గ‌మనించి తాను కూడా అలాగే పిలిచేదాన్న‌ని చెప్పుకొచ్చారు.

 

View this post on Instagram

 

A post shared by Anna Konidala (@anna.konidala)

24 గంటల్లోనే 2.40 ల‌క్ష‌ల ఫాలోవ‌ర్లు..

చిరంజీవిని అన్న‌య్య అని, నాగ‌బాబును చిన్న‌న్న‌య్య అని పిలిచేదాన్న‌ని అన్నా లెజినోవా వివ‌రించారు. మొద‌ట మామూలుగా అన్న‌య్య అని పిలిచాన‌ని, కానీ ఆ త‌రువాతే ఆ బంధం గొప్ప‌త‌నం అర్థ‌మైంద‌ని అన్నారు. త‌రువాత తాను బావ‌గారు అని పిల‌వ‌డం నేర్చుకున్నాన‌ని, త‌న‌కు సోద‌రులు లేర‌ని, కానీ ఈ బంధం త‌న‌కు చిరంజీవి, నాగ‌బాబుల రూపంలో ఇద్ద‌రు సోదరుల‌ను ఇచ్చింద‌ని ఆమె తెలిపారు. కాగా అన్నా లెజినోవా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పెట్టిన పోస్టు ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతోంది. ఆమె తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను ఓపెన్ చేయ‌గా 24 గంట‌ల్లోనే 2.40 ల‌క్ష‌ల మంది ఫాలోవ‌ర్లు వ‌చ్చి చేరారు. ఎంతో కాలంగా ఇన్‌స్టా ఖాతా ఓపెన్ చేయాల‌ని అనుకుంటున్నాన‌ని, ఇప్పుడు స‌రైన స‌మ‌యం వ‌చ్చింద‌ని, అందుక‌నే అకౌంట్ ఓపెన్ చేశాన‌ని ఆమె తెలిపారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment