చిరంజీవి భుజానికి సర్జరీ.. చేతికి కట్టుతో కనిపించిన మెగాస్టార్, స్వయంగా హెల్త్ అప్‌డేట్!

న‌టుడు చిరంజీవి తన ఆరోగ్య పరిస్థితిపై అభిమానులకు స్పష్టతనిచ్చారు. ఇటీవల తాను స్వల్ప స్థాయి భుజం (షోల్డర్) కీహోల్ సర్జరీ చేయించుకున్నాన‌ని, ప్రస్తుతం వేగంగా కోలుకుంటున్నానని తెలిపారు. చిరంజీవి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో భుజానికి స్లింగ్ ధరించిన ఫోటోను షేర్ చేస్తూ పోస్టు పెట్టారు.

February 17, 2026 1:53 PM
Chiranjeevi with an arm sling after minor shoulder surgery.
తన ఆరోగ్య పరిస్థితిపై సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చిన చిరంజీవి. Photo Credit: Chiranjeevi/Instagram.

న‌టుడు చిరంజీవి తన ఆరోగ్య పరిస్థితిపై అభిమానులకు స్పష్టతనిచ్చారు. ఇటీవల తాను స్వల్ప స్థాయి భుజం (షోల్డర్) కీహోల్ సర్జరీ చేయించుకున్నాన‌ని, ప్రస్తుతం వేగంగా కోలుకుంటున్నానని తెలిపారు. చిరంజీవి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో భుజానికి స్లింగ్ ధరించిన ఫోటోను షేర్ చేస్తూ పోస్టు పెట్టారు. చాలామంది శ్రేయోభిలాషులు నా ఆరోగ్యం గురించి అడుగుతున్నారు. ఇది కేవలం చిన్నపాటి షోల్డర్ కీహోల్ సర్జరీ మాత్రమే. ఇప్పుడు బాగా కోలుకుంటున్నాను. మళ్లీ నిత్య కార్యక్రమాలకు తిరిగి వస్తున్నాను.. అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించిన డాక్టర్ నితిన్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, తనపై చూపిన ప్రేమాభిమానాలకు అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు.

ఇటీవ‌లే మ‌న‌వ‌డు, మ‌న‌వ‌రాలికి నామ‌క‌ర‌ణం..

కాగా ఇటీవల చిరంజీవి తన మనవడు, మ‌న‌వ‌రాలి పేర్లను కూడా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. రామ్‌చరణ్, ఉపాసన దంపతుల పిల్లల నామకరణ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోల‌ను పంచుకుంటూ పేర్ల వెనుక ఉన్న అర్థాన్ని వివరించారు. మనవడి పేరు శివ రామ్ అని, అది శివశంకర వరప్రసాద్ నుంచి ప్రేరణ పొందిన శివతో పాటు, రామ్‌చరణ్‌ను ప్రతిబింబించే రామ్ కలయికగా ఆధ్యాత్మిక శక్తి, ధర్మబద్ధతకు ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు.

విశ్వంభ‌ర‌తో ముందుకు..

అలాగే మనవరాలు అన్వీర దేవి పేరు ధైర్యం, శక్తి, దైవిక రక్షణకు ప్రతిరూపమని, కనకదుర్గాదేవి ఆశీస్సుల ప్రేరణతో ఈ పేరు పెట్టినట్లు పేర్కొన్నారు. కాగా నూతన శిశువులపై అందరూ తమ ఆశీస్సులు కురిపించాలని చిరంజీవి కోరారు. ఇక ఆయ‌న సినిమాల విష‌యానికి వ‌స్తే ఇటీవ‌లే ఆయ‌న న‌టించిన మ‌న శంక‌ర వ‌ర ప్ర‌సాద్ గారు చిత్రం సంక్రాంతికి విడుద‌లై బాక్సాఫీస్ వ‌ద్ద విజ‌యాన్ని న‌మోదు చేయ‌గా, ఆయ‌న త‌రువాతి చిత్రం విశ్వంభ‌ర‌తో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నారు. ఈ సినిమాను ఈ ఏడాది వేస‌విలో రిలీజ్ చేసే ఆలోచ‌న‌లో మేక‌ర్స్ ఉన్న‌ట్లు తెలుస్తోంది. దీనిపై త్వ‌ర‌లోనే అధికారిక స‌మాచారం ప్రక‌టించ‌నున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment