షూటింగ్ లో ప్రభాస్ కు గాయం.. ట్రోలర్స్ నోళ్లు మూయిస్తున్న డార్లింగ్ ఫ్యాన్స్!

రాజా సాబ్ విడుదల సమయంలో ప్రభాస్‌పై పలు ప్రతికూల కథనాలు తెరపైకి వచ్చిన విష‌యం తెలిసిందే. కొన్ని పాటలు, యాక్షన్ సన్నివేశాల్లో ఫేస్‌-స్వాప్ షాట్లు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో ఓ వర్గం తీవ్ర విమర్శలు చేసింది.

February 16, 2026 11:46 AM
Actor Prabhas during the shooting of Fauzi movie directed by Hanu Raghavapudi.
‘ఫౌజీ’ షూటింగ్‌లో గుర్రపు స్వారీ చేస్తూ గాయపడ్డ ప్రభాస్. Photo Credit: Prabhas/X.

రాజా సాబ్ విడుదల సమయంలో ప్రభాస్‌పై పలు ప్రతికూల కథనాలు తెరపైకి వచ్చిన విష‌యం తెలిసిందే. కొన్ని పాటలు, యాక్షన్ సన్నివేశాల్లో ఫేస్‌-స్వాప్ షాట్లు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో ఓ వర్గం తీవ్ర విమర్శలు చేసింది. ఈ వ్యాఖ్యలతో కొంతమంది అభిమానులు కూడా నిరాశకు గురయ్యారు. అయితే, మరికొందరు మాత్రం ఇవన్నీ సాంకేతిక లోపాలు లేదా దర్శకత్వ సంబంధిత నిర్ణయాల వల్ల వచ్చి ఉండొచ్చని, ముఖ్యంగా ప్రభాస్ ఆ సినిమా కోసం చేసిన విస్తృత షూటింగ్ డేస్‌ను దృష్టిలో పెట్టుకోవాలని వాదించారు. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రభాస్‌కు సంబంధించిన తాజా వార్త సోషల్ మీడియాలో చర్చ దిశను పూర్తిగా మార్చేసింది. తన కొత్త సినిమా షూటింగ్‌లో భాగంగా గుర్రపు స్వారీ సన్నివేశం చిత్రీకరణ సమయంలో ప్రభాస్‌కు స్వల్ప గాయం అయినట్లు సమాచారం బయటకు వచ్చింది. ఈ ఘటనతో గతంలో వచ్చిన విమర్శలను అభిమానులు గట్టిగా ఖండిస్తున్నారు.

ట్రోలర్స్‌కు ఫ్యాన్స్ గ‌ట్టిగా స‌మాధానం..

భారీ యాక్షన్ సన్నివేశాల కోసం ప్రభాస్ ఎంత శారీరక శ్రమ పడుతున్నాడో ఈ సంఘటనే నిదర్శనమని ఆయ‌న ఫ్యాన్స్‌ అభిప్రాయపడుతున్నారు. అప్పట్లో వచ్చిన విమర్శలు ఆయన అంకితభావాన్ని ఏమీ చేయ‌లేక‌పోయాన‌ని ఫ్యాన్స్ అంటున్నారు. అయితే, ఈ గాయంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సినీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రభాస్‌కు వచ్చినది చిన్న గాయమేనని, ఆయన త్వ‌ర‌లోనే మళ్లీ షూటింగ్‌లో పాల్గొనే అవకాశం ఉందని సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం ఆయన హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫౌజీ సినిమా కోసం గుర్రపు స్వారీ సన్నివేశ చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొంటున్నారు.

రాజా సాబ్ పరాజయం తర్వాత ప్రభాస్ మీడియాకు దూరంగా ఉంటూ లో-ప్రొఫైల్‌ను కొనసాగిస్తున్నారు. పెండింగ్‌లో ఉన్న ఫౌజీ, స్పిరిట్ సినిమాల షూటింగ్‌ను పూర్తి చేసి, ఆ తర్వాత కొంత విరామం తీసుకుని బలమైన కమ్‌బ్యాక్ ఇవ్వడమే ఆయన ప్రధాన లక్ష్యంగా తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ పూర్తిగా కోలుకున్నారని, మళ్లీ ఉత్సాహంగా పనిలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నారని సమాచారం.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment