Rashmika Mandanna : విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో అక్క‌డికి వెళ్లిన‌ట్టు ఒప్పేసుకున్న ర‌ష్మిక‌.. షాకవుతున్న ఫ్యాన్స్..

January 30, 2023 2:42 PM

Rashmika Mandanna : స్టార్ హీరోయిన్ ర‌ష్మిక గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఛలో’ సమయంలో ఈ అమ్మ‌డు ఎంత గ్లామర్‌గా ఉందో… ఇప్పుడూ అలానే ఉంది. గ్లామర్‌ని కాపాడుకోవడం, కొత్తగా కనిపించడం.. రష్మిక మందన్నా విజయ రహస్యాలు. అయితే ఇదంతా అంత తేలిగ్గా జరగలేదు. ఫిట్‌నెస్‌, ఆహార నియమాలు, కాస్ట్యూమ్స్‌.. ఇలా అన్ని విషయాల్లోనూ ఆమె శ్రద్ధ పెట్ట‌డంతోనే ఇది సాధ్య‌మైంది. సినిమా సినిమాకి త‌న టాలెంట్ పెంచుకుంటూ వ‌రుస ఆఫ‌ర్స్ ద‌క్కించుకుంటున్న ర‌ష్మిక ప్ర‌స్తుతం బాలీవుడ్‌లోను తెగ సంద‌డి చేస్తుంది. ఇప్పుడు హాలీవుడ్‌ సినిమాల్లోకి సూపర్‌ ఉమెన్‌గా కూడా ముస్తాబైంది. ఉబికి వచ్చే అందాలతో సోషల్‌ మీడియాలో రచ్చ చేస్తుంది. తన హాట్‌ అందాలను ఆవిష్కరిస్తూ ఫ్యాన్స్ ని ఫిదా చేస్తుంది రష్మిక మందన్నా.

గీతా గోవిందం సినిమాలో విజ‌య్ దేవ‌ర‌కొండ స‌ర‌స‌న న‌టించిన ర‌ష్మిక అత‌నితో ప్రేమ‌లో ప‌డింద‌ని చెప్పుకొస్తున్నారు. కొన్నాళ్లుగా క‌లిసి తిరుగుతున్నార‌ని, సీక్రెట్ ఎఫైర్ న‌డుపుతున్నార‌ని ఎన్నో ప్ర‌చారాలు సాగాయి. గత ఏడాది చివర్లో ఇద్దరూ కలిసి మాల్దీవులకి హాలిడేకి వెళ్లారు. వాస్తవానికి ముంబయి ఎయిర్‌పోర్ట్‌లోనే నిమిషాల వ్యవధిలో ఇద్దరూ ఎంట్రీ ఇవ్వ‌డంతో వారిద్ద‌రు ఒకే ప్లేస్‌కి వెళుతున్నార‌ని అనుకున్నారు. కొద్ది రోజుల త‌ర్వాత ఇద్దరూ షేర్ చేసిన ఫొటోల బ్యాక్‌డ్రాప్ ఆధారంగా మాల్దీవుల్లో ఉన్నారని నెటిజన్లు కనిపెట్టేశారు.

Rashmika Mandanna finally agreed that she went on vacation with vijay
Rashmika Mandanna

రష్మిక మందన ఇన్‌స్టా లైవ్‌లో అభిమానులతో మాట్లాడుతుండగా.. ఆ స‌మ‌యంలో విజయ్ దేవరకొండ వాయిస్ కూడా వినిపించింది. దాంతో ఇద్దరూ డేటింగ్‌లో ఉన్నారని ప్ర‌చారాలు చేశారు. ఇదే స‌మ‌యంలో ర‌ష్మిక ‘మిషన్ మజ్ను’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మాట్లాడుతూ…. విజయ్ దేవరకొండతో మాల్దీవుల ట్రిప్ పై స్పందించింది.. ‘‘అవును ఇద్దరం కలిసి మాల్దీవులకి వెళ్లాం. అందులో తప్పేముంది? మేము ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్ అంతే’ అని స్పష్టం చేసింది. దీంతో ఇండ‌స్ట్రీలో మ‌రో చ‌ర్చ న‌డుస్తుంది. గ‌తంలో ఫ్రెండ్స్ అని చెప్పిన వాళ్లు చాలా మంది పెళ్లిళ్లు చేసుకున్నారు. వీరు అలా చేసుకున్నా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదు అని అంటున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now