Chiranjeevi : ప్ర‌భాస్ కోసం సిద్ధం చేసిన క‌థ‌తో చిరంజీవి సినిమా..?

June 17, 2022 8:03 PM

Chiranjeevi : మెగాస్టార్ చికంజీవి ఈమ‌ధ్యే ఆచార్య సినిమాతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించారు. అయితే ఈ మూవీ అనుకున్న ఫ‌లితాన్ని అందించ‌లేక‌పోయింది. బాక్సాఫీస్ వ‌ద్ద ఈ మూవీ నిరాశ ప‌రిచింది. ఈ క్ర‌మంలోనే చిరంజీవి త‌న త‌దుప‌రి చిత్రం గాడ్ ఫాద‌ర్‌పైనే ఆశ‌లు పెట్టుకున్నారు. ఈ మూవీని ద‌స‌రాకు రిలీజ్ చేయాల‌ని చూస్తున్న‌ట్లు స‌మాచారం. ఇక ఇదే కాకుండా భోళా శంక‌ర్, వాల్తేరు వీర‌య్య మూవీలు కూడా లైన్‌లో ఉన్నాయి. అయితే ఈ సినిమాలు ఇంకా పూర్తి కానేలేదు.. చిరంజీవి ఇంకో సినిమాను లైన్‌లో పెడుతున్న‌ట్లు తెలుస్తోంది. అది కూడా త‌మిళ ద‌ర్శ‌కుడితో సినిమా కావ‌డం విశేషం.

ఇటీవ‌లే చిరంజీవిని క‌మ‌ల‌హాస‌న్‌, లోకేష్ క‌న‌గ‌రాజ్‌లు క‌లిసిన విష‌యం విదిత‌మే. క‌మ‌ల‌హాస‌న్ న‌టించిన విక్ర‌మ్ చిత్రానికి లోకేష్ ద‌ర్శ‌కుడు. ఈ క్ర‌మంలోనే హైద‌రాబాద్‌కు వ‌చ్చిన వీరిని చిరంజీవి స‌న్మానించారు. వీరికి త‌న ఇంట్లోనే చిరు విందు ఇచ్చారు. అయితే ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు లోకేష్‌ను మూవీ గురించి చిరంజీవి అడిగార‌ట‌. గ‌తంలో లోకేష్ ప్ర‌భాస్‌కు ఓ స్టోరీ చెప్పార‌ట‌. కానీ ప్ర‌భాస్ ఆ స్టోరీని రిజెక్ట్ చేశార‌ట‌. అయితే దానికి చిరంజీవి కొన్ని మార్పులు సూచించార‌ట‌. ఆ మార్పుల‌కు ఓకే అయితే తాను లేదా చ‌ర‌ణ్ ఆ సినిమా చేసేందుకు సిద్ధ‌మ‌ని చిరు.. లోకేష్‌తో అన్నార‌ట‌. దీంతో లోకేష్ అంగీక‌రించిన‌ట్లు కూడా తెలుస్తోంది.

Chiranjeevi may act with the story prepared for Prabhas
Chiranjeevi

అయితే ప్ర‌భాస్ రిజెక్ట్ చేసిన స్టోరీతో చిరంజీవి సినిమా తీస్తారా.. లేక ఆయ‌న త‌న‌యుడు చ‌ర‌ణ్‌కు ఆ సినిమాను అప్ప‌గిస్తారా.. అన్న విష‌యంపై మాత్రం క్లారిటీ రాలేదు. ఇక ప్ర‌స్తుతం చిరంజీవితోపాటు ద‌ర్శ‌కుడు లోకేష్ కూడా ప‌లు ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నారు. క‌నుక ఒక వేళ చిరంజీవితోనే సినిమా చేయాల‌న్నా.. క‌నీసం ఈ ఇద్ద‌రూ ఇంకో ఏడాది వ‌ర‌కు ఆగ‌క త‌ప్ప‌దు. వ‌చ్చే ఏడాది ఇదే స‌మ‌యం వ‌ర‌కు వీరు ముహుర్తం కుదిరితే సినిమా చేసే అవ‌కాశం ఉంది. లేదా చ‌ర‌ణ్‌కు చిరంజీవి ఈ మూవీని అప్ప‌గించ‌వ‌చ్చు. మ‌రి ఇద్ద‌రిలో ఈ మూవీలో ఎవ‌రు న‌టిస్తారో.. వేచి చూస్తే తెలుస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment