Sim Cards : టెలికాం శాఖ హెచ్చ‌రిక‌.. ఎక్కువ సిమ్ కార్డుల‌ను వాడుతున్నారా..? ఇక‌పై అలా కుద‌ర‌దు..!

December 9, 2021 7:00 PM

Sim Cards : దేశంలోని మొబైల్ ఫోన్ వినియోగ‌దారుల‌కు డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలిక‌మ్యూనికేష‌న్స్ (డాట్‌) హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. ప్ర‌స్తుతం దేశంలో చాలా మంది 9 సిమ్ కార్డుల క‌న్నా ఎక్కువ సంఖ్య‌లో కార్డుల‌ను వాడుతున్నార‌ని గుర్తించింది. దీంతో అలాంటి సిమ్‌ల‌న్నీ ఇక‌పై ప‌నిచేయ‌కుండా పోనున్నాయి. ఈ మేర‌కు టెలికాం శాఖ ఉత్త‌ర్వులు జారీ చేసింది.

if you are using more Sim Cards then be alert they will be de activated

దేశంలో ఇక‌పై 9 క‌న్నా ఎక్కువ సంఖ్య‌లో సిమ్‌కార్డుల‌ను వాడ‌డం కుద‌ర‌దు. అదే జ‌మ్మూ కాశ్మీర్‌, ఈశాన్య రాష్ట్రాలు, అస్సాంల‌లో అయితే 6 క‌న్నా ఎక్కువ సంఖ్య‌లో సిమ్ కార్డుల‌ను వాడ‌రాదు. ఒక వేళ వాడ‌ద‌లిస్తే డిసెంబ‌ర్ 7న టెలికాం శాఖ నోటిఫికేష‌న్ ఇచ్చిన‌ప్ప‌టి నుంచి 60 రోజుల్లోగా పౌరులు తాము వాడుతున్న సిమ్ కార్డుల‌ను రీ వెరిఫికేష‌న్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఆలోగా రీ వెరిఫికేష‌న్ చేయించుకోక‌పోతే అలాంటి సిమ్ కార్డుల‌ను డీయాక్టివేట్ చేయ‌నున్నారు. ఈ మేర‌కు టెలికాం స‌ర్వీస్ ప్రొవైడ‌ర్ల‌కు ఆ శాఖ స్ప‌ష్ట‌మైన ఆదేశాలను జారీ చేసింది.

దేశంలో చాలా మంది లెక్క‌కు మించి సిమ్ కార్డుల‌ను వాడుతున్నార‌ని టెలికాం శాఖ తెలియ‌జేసింది. అయితే కొంద‌రు అలాంటి సిమ్‌ల‌తో చ‌ట్ట వ్య‌తిరేక కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డుతున్నార‌ని.. అందువ‌ల్లే ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని వెల్ల‌డించింది.

అయితే అంగ వైక‌ల్యం ఉన్న‌వారికి, హాస్పిట‌ల్‌లో చేరి చికిత్స పొందుతున్న వారికి, విదేశాల్లో ఉన్న‌వారికి 60 రోజులు కాకుండా అద‌నంగా మ‌రో 30 రోజుల స‌మ‌యం ఇస్తున్న‌ట్లు టెలికాం శాఖ తెలియ‌జేసింది. క‌నుక 9 క‌న్నా ఎక్కువ సంఖ్య‌లో సిమ్ కార్డులు ఉన్న‌వారు వెంట‌నే రీ వెరిఫికేష‌న్ చేయించుకోండి. లేదంటే ఆ కార్డులు డీయాక్టివేట్ అయిపోతాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment