అమెజాన్ సేల్.. ఏఐ ల్యాప్‌టాప్‌లపై భారీ డిస్కౌంట్లు! రూ. 8000 ఇన్‌స్టంట్ ఆఫర్..

అమెజాన్ ఇండియా ఏఐ పీసీ డేస్ పేరిట ప్రత్యేక సేల్‌ను నిర్వహిస్తోంది. ఆన్-డివైస్ ఏఐ వర్క్‌లోడ్స్‌ను సమర్థవంతంగా నిర్వహించగల ప్రత్యేక ఎన్‌పీయూ కలిగిన ల్యాప్‌టాప్‌ల విస్తృత శ్రేణి ఈ సేల్‌లో అందుబాటులో ఉంది. ఈ సేల్ ఫిబ్రవరి 15, 2025 వరకు కొనసాగనుంది.

February 13, 2026 10:30 PM

 

Amazon AI PC Days sale featuring laptops with NPU and instant discounts.
అమెజాన్ ఏఐ పీసీ డేస్ సేల్: ల్యాప్‌టాప్‌లపై అదిరిపోయే డీల్స్. Photo Credit: Amazon India.

అమెజాన్ ఇండియా ఏఐ పీసీ డేస్ పేరిట ప్రత్యేక సేల్‌ను నిర్వహిస్తోంది. ఆన్-డివైస్ ఏఐ వర్క్‌లోడ్స్‌ను సమర్థవంతంగా నిర్వహించగల ప్రత్యేక ఎన్‌పీయూ కలిగిన ల్యాప్‌టాప్‌ల విస్తృత శ్రేణి ఈ సేల్‌లో అందుబాటులో ఉంది. ఈ సేల్ ఫిబ్రవరి 15, 2025 వరకు కొనసాగనుంది. వినియోగదారులకు గరిష్టంగా 9 నెలల నో-కాస్ట్ ఈఎంఐ సౌకర్యంతో పాటు రూ.8వేల వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ కూడా లభిస్తోంది. ఈ సేల్‌లో ఏఐ ప‌వ‌ర్‌తో కూడిన పలు ల్యాప్‌టాప్‌లపై ప్రత్యేక ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.

డిస్కౌంట్లు, ఆఫ‌ర్లు ల‌భిస్తున్న ప‌లు ల్యాప్ టాప్‌ల వివ‌రాలు..

  • అసుస్ వివోబుక్ 16 (స్నాప్ డ్రాగ‌న్ ఎక్స్‌, క్వాల్ కామ్ అడ్రినో ఐజీపీయూ, 45 టాప్స్, 16జీబీ ర్యామ్‌, 512జీబీ ఎస్ఎస్డీ, ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ 16 ఇంచుల డిస్‌ప్లే, విండోస్ 11, ఆఫీస్ హోమ్ 2024) ధ‌ర రూ.52,990గా ఉంది.
  • హెచ్‌పీ ఓమ్నిబుక్ 5 ఓలెడ్ (స్నాప్‌డ్రాగ‌న్ ఎక్స్ ప్రాసెస‌ర్‌, 16జీబీ ర్యామ్‌, 1టీబీ ఎస్ఎస్డీ, 2కె 14 ఇంచుల డిస్‌ప్లే, విండోస్ 11) ధర రూ.65,990 కాగా, కార్డ్ డిస్కౌంట్ అనంతరం రూ.57,740కు ల‌భిస్తోంది.
  • అసుస్ వివోబుక్ 14 (ఏఎండీ రైజెన్ ఏఐ 5 330, 16జీబీ ర్యామ్, 512జీబీ ఎస్ఎస్డీ, ఫుల్ హెచ్‌డీప్ల‌స్ 14 ఇంచుల డిస్‌ప్లే, విండోస్ 11, ఆఫీస్ 24, ఎం365 ఒక సంవ‌త్స‌రం) ధర రూ.59,990గా ఉంది. కార్డ్ డిస్కౌంట్ తరువాత ఇది రూ.54,990కి లభిస్తుంది.
  • లెనోవో యోగా స్లిమ్ 7 (ఇంటెల్ కోర్ అల్ట్రా 5 125హెచ్‌, 16జీబీ ర్యామ్‌, 512జీబీ ఎస్ఎస్‌డీ, ఏఐ పీసీ, డ‌బ్ల్యూయూఎక్స్‌జీఏ – ఓలెడ్ 14 ఇంచుల డిస్‌ప్లే, విండోస్ 11, మైక్రోసాఫ్ట్ 365 బేసిక్ ప్ల‌స్ ఆఫీస్ 2024) ధర రూ.84,990 కాగా, కార్డ్ ఆఫర్‌తో రూ.79,240కి అందుబాటులో ఉంది.
  • ఏస‌ర్ ఆస్ప‌యిర్ గో 14 (14వ త‌రం ఇంటెల్ కోర్ అల్ట్రా 5 125హెచ్, 16జీబీ ర్యామ్‌, 512జీబీ ఎస్ఎస్డీ, డ‌బ్ల్యూయూఎక్స్‌జీఏ ఐపీఎస్ 14 ఇంచుల డిస్‌ప్లే, విండోస్ 11, ఎంఎస్ ఆఫీస్‌) ధర రూ.54,516గా ఉంది. కార్డ్ డిస్కౌంట్ అనంతరం ఇది రూ.43,740కి లభిస్తోంది.
  • డెల్ 14 (ఏఎండీ రైజెన్ ఏఐ ఆర్‌5-340, 16జీబీ ర్యామ్‌, 512జీబీ ఎస్ఎస్‌డీ, ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ 14 ఇంచుల డిస్‌ప్లే, విండోస్ 11, ఎంఎస్ ఆఫీస్ 2024) ధర రూ.73,490గా ఉంది.
  • అసుస్ వివోబుక్ ఎస్‌14 (ఏఎండీ రైజెన్ ఏఐ7 350, 16జీబీ ర్యామ్, 1టీబీ ఎస్ఎస్‌డీ, ఓలెడ్ 14 ఇంచుల డిస్‌ప్లే, విండోస్ 11, ఆఫీస్ 24, ఎం365 బేసిక్ ఒక సంవ‌త్స‌రం) ధరను రూ.83,990గా నిర్ణయించారు.
  • హెచ్‌పీ ఓమ్నిబుక్ 7 ఓలెడ్ (ఇంటెల్ కోర్ అల్ట్రా5 255హెచ్‌, 16జీబీ ర్యామ్, 1టీబీ ఎస్ఎస్డీ, 3కె 14 ఇంచుల డిస్‌ప్లే, విండోస్ 11) ధర రూ.86,490గా ఉంది.
  • అసుస్ వివోబుక్ ఎస్‌16 (ఇంటెల్ కోర్ అల్ట్రా7 255హెచ్‌, ఇంటెల్ ఆర్క్ ఐజీపీయూ, 16జీబీ ర్యామ్‌, 512జీబీ ఎస్ఎస్డీ) ధర రూ.92,990గా ఉంది.
  • లెనోవో యోగా 7 2-ఇన్‌-1 (ఇంటెల్ కోర్ అల్ట్రా7 258వి, 32జీబీ ర్యామ్‌, 1టీబీ ఎస్ఎస్‌డీ, డబ్ల్యూక్యూఎక్స్‌జీఏ ప్ల‌స్ ఓలెడ్ 14 ఇంచుల డిస్‌ప్లే, కోపైల‌ట్ ప్ల‌స్ ఏఐ పీసీ) ధర రూ.1,45,990గా ఉంది.
  • అసుస్ జెన్‌బుక్ ఎస్‌16 (ఏఎండీ రైజెన్ ఏఐ7 ఆక్టాకోర్ 350, 24జీబీ ర్యామ్, 1టీబీ ఎస్ఎస్డీ, 3కె ఓలెడ్ ట‌చ్ స్క్రీన్ 16 ఇంచుల డిస్‌ప్లే, విండోస్ 11, ఎం365 బేసిక్ ఒక సంవ‌త్స‌రం) ధర రూ.1,34,990గా ఉంది.

బ్యాంకు డిస్కౌంట్ల వివ‌రాలు..

ఇక ఈ సేల్‌లో పలు బ్యాంక్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

  • హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై గరిష్టంగా రూ.4,500 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తోంది.
  • యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐపై గరిష్టంగా రూ.3,750 తగ్గింపు ఉంటుంది.
  • బ్యాంక్ ఆఫ్ బ‌రోడా కార్డ్ క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ అందిస్తోంది.
  • కెన‌రా బ్యాంక్ వీసా డెబిట్ కార్డ్‌పై 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొంద‌వ‌చ్చు.
  • హెచ్ఎస్‌బీసీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐపై గరిష్టంగా రూ.3,750 తగ్గింపు ఉంది.
  • ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్‌లపై గరిష్టంగా 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ను అందిస్తున్నారు.
  • బంధన్ బ్యాంక్ డెబిట్ కార్డ్‌పై 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తోంది.
  • వ‌న్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐపై గరిష్టంగా రూ.3,500 తగ్గింపు అందుబాటులో ఉంది.
  • పీఎన్‌బీ క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ అందిస్తోంది.
  • స్కేపియా ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐపై 5 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తోంది.
  • యెస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐపై 7.5 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ అందిస్తోంది.

గ‌మ‌నిక‌: ఆయా ప్రొడ‌క్ట్‌ల‌పై ఆఫ‌ర్లు లేదా డిస్కౌంట్లు స్టాక్ ఉన్నంత వ‌ర‌కే అందుబాటులో ఉంటాయి. క‌నుక వినియోగ‌దారులు త్వ‌ర‌గా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఆయా ఉత్ప‌త్తుల ధ‌ర‌లు సైతం నిరంత‌రం మారుతుంటాయి. క‌నుక వినియోగ‌దారులు అమెజాన్ సైట్ లో సేల్ పేజీని ఎప్ప‌టిక‌ప్పుడు సంద‌ర్శించి ధ‌ర‌లు, ఆఫ‌ర్లు, డిస్కౌంట్ల వివ‌రాల‌ను తెలుసుకోవాల్సి ఉంటుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment