బడాబాబులు కొందరు డబ్బుందనే అహంకారంతో ఏమైనా చేస్తారు. తాము చేసే పనులను సరైనవే అని సమర్థించుకుంటుంటారు. సమాజంలో ఇలాంటి వారు మనకు చాలా అరుదుగా కనిపిస్తుంటారు. ఇప్పుడు చెప్పబోయే ఎమ్మెల్యే కూడా సరిగ్గా ఇదే కోవకు చెందినవాడే. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే..
కర్ణాటకలోని కనకగిరి (కొప్పల్) ఎమ్మెల్యే బసవరాజ్ దడెసుగుర్ కుమారుడు సురేష్ ఇటీవలే తన బర్త్ డేను జరుపుకున్నాడు. అందుకు గాను అతను తన స్నేహితులను తన బీఎండబ్ల్యూ కార్‌లో అక్కడి హోసపేట్ అనే ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ గ్రాండ్‌గా బర్త్ డేను సెలబ్రేట్ చేసుకున్నాడు.
అయితే బర్త్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన కొన్ని కేకులను సురేష్ తన ఐఫోన్‌తో కట్ చేశాడు. ఒకదాని తరువాత ఒకటి కట్ చేస్తూ వెళ్లాడు. ఈ క్రమంలో తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే డబ్బుందనే అహంకారంతోనే అతను ఈ విధంగా చేశాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక దీనిపై ఆ రాష్ట్ర ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ నాయకులు కూడా స్పందించారు.
అసలే కోవిడ్ కాలం, ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు, ఇలాంటి సమయాల్లో వారికి సహాయం చేయాల్సింది పోయి.. డబ్బుందనే అహంకారంతో ఇలా ప్రవర్తించడం ఏమాత్రం సరికాదన్నారు. అయితే దీనిపై సదరు ఎమ్మెల్యే బసవరాజ్ స్పందించారు. తాను కష్టపడి సంపాదించిన డబ్బు అని, దాన్ని ఖర్చు పెట్టే హక్కు తన కుమారుడికి ఉందని, అందుకనే బర్త్ డేను అలా జరుపుకున్నాడని సమర్థించారు. అంతేకాదు, కోవిడ్ కనుక కత్తితో కాకుండా ఐఫోన్‌తో కేక్ కట్ చేశాడని, దీంట్లో రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదని అన్నాడు. ఈ క్రమంలో నెటిజన్లు మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…