Clothes : కొత్త దుస్తులను ధరించడమంటే అందరికి ఇష్టమే. కానీ వారంలో కొన్ని రోజులు కొత్త దుస్తులను ధరించకూడదని పండితులు చెబుతున్నారు. దీనికి విరుద్దంగా కొత్త దుస్తులను వేసుకుంటే మీరు సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు. కొత్త దుస్తులను ఏయే రోజుల్లో వేసుకోకూడదో.. ఇప్పుడు తెలుసుకుందాం. ఆడవాళ్లు నెలకు ఐదారు సార్లన్నా షాపింగ్ చేస్తూ ఉంటారు. ఆఫ్ లైన్ లోనే కాకుండా ఆన్ లైన్ లో కూడా షాపింగ్ చేస్తూ ఉంటారు. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ ఎప్పటికప్పుడు కొత్త దుస్తులను కొనడం, ధరించడాన్ని బాగా ఇష్టపడతారు.
కానీ కొత్త దుస్తులను ధరించడానికి కొన్ని శుభకరమైన, అశుభమైన రోజులు ఉన్నాయన్న సంగతి మీకు తెలుసా…! అవును జోతిష్య శాస్త్రం ప్రకారం వారంలో కొన్ని రోజులు కొత్త దుస్తులను వేసుకోకూడదని నమ్ముతారు. కొత్త దుస్తులను వారంలో 3 రోజులు వేసుకోకూడదు. ఒకవేళ ఈ రోజుల్లో కొత్త దుస్తులు వేసుకుంటే ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆదివారం కొత్త దుస్తులను వేసుకోవద్దు. జోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం నాడు కొత్త దుస్తులను వేసుకోవడం వల్ల వ్యక్తి జాతకంలో సూర్యగ్రహం ప్రభావం ఉండవచ్చు. ఇది జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. అంతేకాకుండా ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి.
అలాగే మంగళవారం నాడు కూడా కొత్త దుస్తులను ధరించకూడదు. మంగళవారం కొత్త దుస్తులను ధరిస్తే వ్యక్తికి కోపం పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా శనివారం కూడా కొత్త దుస్తులను ధరించకూడదని జోతిష్య పండితులు చెబుతున్నారు. శనివారం కొత్త దుస్తులను ధరించడం వల్ల శనిదేవుడికి ఆ వ్యక్తిపై కోపం వస్తుందట. అలాగే శనివారం నాడు కొత్త దుస్తులను ధరించడం వల్ల ధననష్టం కలుగుతుందట. వ్యక్తి జాతకంలో శనిలోపం సంభవించొచ్చని పండితులు చెబుతున్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…