Clothes : కొత్త‌దుస్తుల‌ను వారంలో ఏ రోజు ధ‌రించాలి..?

June 16, 2024 9:39 AM

Clothes : కొత్త దుస్తుల‌ను ధ‌రించ‌డ‌మంటే అంద‌రికి ఇష్ట‌మే. కానీ వారంలో కొన్ని రోజులు కొత్త దుస్తుల‌ను ధ‌రించ‌కూడ‌దని పండితులు చెబుతున్నారు. దీనికి విరుద్దంగా కొత్త దుస్తుల‌ను వేసుకుంటే మీరు స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని చెబుతున్నారు. కొత్త దుస్తుల‌ను ఏయే రోజుల్లో వేసుకోకూడ‌దో.. ఇప్పుడు తెలుసుకుందాం. ఆడ‌వాళ్లు నెల‌కు ఐదారు సార్ల‌న్నా షాపింగ్ చేస్తూ ఉంటారు. ఆఫ్ లైన్ లోనే కాకుండా ఆన్ లైన్ లో కూడా షాపింగ్ చేస్తూ ఉంటారు. చిన్న పిల్ల‌ల నుండి పెద్ద‌ల వ‌ర‌కు ప్ర‌తి ఒక్క‌రూ ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త దుస్తుల‌ను కొన‌డం, ధ‌రించ‌డాన్ని బాగా ఇష్ట‌ప‌డ‌తారు.

కానీ కొత్త దుస్తుల‌ను ధ‌రించ‌డానికి కొన్ని శుభ‌క‌ర‌మైన‌, అశుభ‌మైన రోజులు ఉన్నాయ‌న్న సంగ‌తి మీకు తెలుసా…! అవును జోతిష్య శాస్త్రం ప్ర‌కారం వారంలో కొన్ని రోజులు కొత్త దుస్తుల‌ను వేసుకోకూడ‌ద‌ని న‌మ్ముతారు. కొత్త దుస్తుల‌ను వారంలో 3 రోజులు వేసుకోకూడదు. ఒక‌వేళ ఈ రోజుల్లో కొత్త దుస్తులు వేసుకుంటే ఎన్నో స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. ఆదివారం కొత్త దుస్తుల‌ను వేసుకోవ‌ద్దు. జోతిష్య శాస్త్రం ప్ర‌కారం ఆదివారం నాడు కొత్త దుస్తుల‌ను వేసుకోవ‌డం వ‌ల్ల వ్య‌క్తి జాత‌కంలో సూర్య‌గ్ర‌హం ప్ర‌భావం ఉండ‌వ‌చ్చు. ఇది జీవితాన్ని ప్ర‌భావితం చేస్తుంది. అంతేకాకుండా ఆరోగ్య స‌మ‌స్య‌లు కూడా వ‌స్తాయి.

what is the best day and time to wear new Clothes
Clothes

అలాగే మంగ‌ళ‌వారం నాడు కూడా కొత్త దుస్తుల‌ను ధ‌రించ‌కూడ‌దు. మంగ‌ళ‌వారం కొత్త దుస్తుల‌ను ధ‌రిస్తే వ్య‌క్తికి కోపం పెరిగే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంది. అదేవిధంగా శ‌నివారం కూడా కొత్త దుస్తుల‌ను ధ‌రించ‌కూడ‌దని జోతిష్య పండితులు చెబుతున్నారు. శ‌నివారం కొత్త దుస్తుల‌ను ధ‌రించ‌డం వ‌ల్ల శ‌నిదేవుడికి ఆ వ్య‌క్తిపై కోపం వ‌స్తుంద‌ట‌. అలాగే శ‌నివారం నాడు కొత్త దుస్తుల‌ను ధ‌రించ‌డం వ‌ల్ల ధ‌న‌న‌ష్టం క‌లుగుతుంద‌ట‌. వ్య‌క్తి జాత‌కంలో శ‌నిలోపం సంభ‌వించొచ్చ‌ని పండితులు చెబుతున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now