Vastu Tips : హిందూయిజంలో వాస్తు శాస్త్రానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. వాస్తు శాస్త్రంలో ఇచ్చిన నియమాలను అందరూ పాటించాల్సి ఉంటుంది. ఈ నియమాలను పాటించకపోతే జీవితంలో అన్నీ సమస్యలే ఎదురవుతుంటాయి. వాస్తు అనేది ఇల్లు ఎలా ఉండాలి, ఎలా దాన్ని నిర్మించాలి అనే విషయాలను తెలియజేస్తుంది. అందువల్ల ఇంటికి ఉత్తరం దిశకు సంబంధించి ఎలాంటి నియమాలను పాటించాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఇంటికి ఉత్తరం దిశను లక్ష్మీదేవి, కుబేర స్థానాలుగా చెబుతారు. అందువల్ల ఈ దిశలో బరువైన వస్తువులను పెట్టకూడదు. అలా పెడితే ఇంట్లో ప్రశాంతత లోపిస్తుంది. అందరికీ సమస్యలే వస్తాయి. ముఖ్యంగా ఇంటి యజమాని ఆర్థిక సమస్యల బారిన పడతారు. కనుక ఉత్తరం దిశలో ఎలాంటి బరువులను పెట్టకూడదు. ఇంటికి ఉత్తరం వైపు కొందరు చెప్పులను లేదా చెప్పుల స్టాండ్‌లను పెడుతుంటారు. అలా పెడితే ఇంట్లో అంతా నెగెటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది. ఇది ఏమాత్రం మంచిది కాదు. కనుక అలా చేయకూడదు.
ఇంటికి ఉత్తరం వైపు మూసి ఉన్న బావి ఉండకూడదు. అలా ఉంటే మీ ఇంట్లోకి సంపద రాదు. ఇక ఉత్తరం వైపు కిటికీ ఉంటే మంచిది. మీ ఇంట్లోకి సంపద వస్తుంది. ఇక కొందరు ఇంటికి ఉత్తరం వైపు డస్ట్ బిన్ పెడతారు. ఇలా చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహిస్తుంది. మీకు ఆర్థిక సమస్యలు వచ్చేలా చేస్తుంది. కనుక ఈ తప్పు కూడా చేయకూడదు. ఇంటికి ఉత్తరం వైపు కొందరు టాయిలెట్లను కట్టిస్తారు. ఇలా చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురికాక తప్పదు. కనుక ఈ తప్పు కూడా చేయవద్దు. ఇలా ఉత్తరం వైపుకు సంబంధించి పలు వాస్తు నియమాలను పాటించాల్సి ఉంటుంది. వీటిని పాటించకపోతే తీవ్రమైన సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కనుక ఈ తప్పులను చేయకండి.
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్‌లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…