జుట్టు, గోర్లు ఏ రోజు కత్తిరించాలి..? ఈ తప్పులని చేశారంటే మాత్రం దరిద్రమే.. కష్టాలే..!

June 24, 2023 6:21 PM

మన పెద్దలు మంచే చేయాలని చెడుని చేయకూడదని చెప్తూ ఉంటారు. పైగా ఎప్పుడైనా జుట్టుని కత్తిరించుకోవాలన్నా గోర్లను కత్తిరించుకోవాలన్నా ఈరోజు మంచిది కాదు అని చెప్తూ ఉంటారు. చాలామందిలో ఉండే సందేహం ఏంటంటే ఏ రోజు జుట్టు కత్తిరించుకోవాలి ఏ రోజు గోర్లని కత్తిరించుకోవాలి అని.. నిజానికి జుట్టుని కట్ చేసుకోవడం, గడ్డం చేసుకోవడం వంటివి ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదు. ఆచారాలని పాటించేవారు ఏ రోజున గోర్లని కత్తిరించుకోవడం శుభం ఏ రోజు జుట్టు కత్తిరించుకుంటే శుభం అనే వివరాలను ఇప్పుడు చూసేద్దాం.

కొంతమందికి ఏమీ తోచక అస్తమాను గోర్లు తీసుకుంటూ ఉంటారు లేదంటే జుట్టు పెరగగానే కత్తిరించుకోవడం గడ్డం పెరగగానే కత్తిరించుకోవడం లాంటివి చేస్తారు. ఎప్పుడు పడితే అప్పుడు ఈ తప్పులను చేయకండి. ఇలా తప్పు చేశారంటే ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు వంటివి కలగవచ్చు. గ్రహాల ప్రభావం మీ పై పడుతుంది పేదరికంలో కూరుకుపోయే ప్రమాదం కూడా ఉంది. శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే జుట్టుని కత్తిరించుకోవడానికి ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల లోపు మాత్రమే మంచి సమయం.

what is the best day and time to cut nails and hair

సోమవారం నాడు జుట్టుని కత్తిరించుకుంటే ఆదాయం పెరుగుతుంది. సంతానం కోసం చూసే వాళ్ళు ఇంటికి ఒకే కొడుకు ఉన్నవాళ్లు సోమవారం నాడు జుట్టుని కత్తిరించుకోకూడదు. మంగళవారం అంగారక గ్రహానికి సంబంధించినది. అంగారకుడికి ధైర్యానికి కారకంగా పరిగణిస్తారు. మంగళవారంనాడు గోళ్ళని కత్తిరించడం జుట్టుని కత్తిరించడం వంటివి చేస్తే కోపం పెరుగుతుంది. ఆయుషు కూడా తగ్గుతుంది. బుధవారం నాడు జుట్టు కత్తిరించుకోవడం వంటివి చేయడం వలన బుధుడు స్థానం బలపడుతుంది నిరుద్యోగులకి మంచి కలుగుతుంది ఆదాయం పెరుగుతుంది.

గురువారం బృహస్పతి గ్రహానికి సంబంధించినది ఈరోజు ఇలాంటి పనులు చేయడం వలన లక్ష్మీదేవికి కోపం వస్తుంది. శుక్రవారం నాడు లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రోజు. ఈరోజు ఇలాంటివి చేస్తే శుభ ఫలితాలను ఇవ్వవు. ఆర్థికపరమైన నష్టాలు కలుగుతాయి. శనివారం నాడు కూడా ఇలాంటి పనులు చేయకూడదు. ఇలాంటివి చేస్తే ఆకస్మాత్తుగా మరణం ఆర్థికపరమైన ఇబ్బందులు కలుగుతాయి. ఆదివారం నాడు ఇటువంటివి చేస్తే ప్రతికూల ప్రభావం పడుతుంది ఆరోగ్య సమస్యలు కలుగుతాయి. విధియ, తదియ, పంచమి, సప్తమి, త్రయోదశి తిధుల్లో ఇలాంటి పనులు చేయడానికి మంచిది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now