Veedhi Potu : వీధి పోటు అంటే ఏమిటి..? దీని వ‌ల్ల ఏం జ‌రుగుతుంది..?

July 3, 2023 4:44 PM

Veedhi Potu : చాలా మందికి తెలియని వీధి పోట్లు, వీధి పోట్లలో రకాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. వీధి పోట్లలో మంచివి, చెడ్డవి కూడా ఉంటాయి. వీధిలో నడిచేవారు భవనాన్ని పొడుచినట్లుగా నడుస్తారు అనే భావనని స్పురింపచేస్తుంది. ఒక ఇంటి ముందు ఉండే వీధి ఇంటిని దాటిన వెంటనే వీధి వంపు తిరిగి తిన్నగా పెరిగితే, వంపు వద్ద ఉండే ఇల్లు వీధి పోటు గల ఇల్లు అవుతుంది.

ఈశాన్య వీధి పోటు అంటే ఏంటి అనేది చూస్తే.. ఈశాన్య వీధి పోటు కలిగితే ఈశాన్య వీధి పోటు అంటారు. దీని వలన కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి. ప్రమాదం ఏమీ కూడా కలగదు. అదే వాయువ్యపు వీధి పోటు వలన అయితే చెడు ఫలితాలు కలుగుతాయి. ఆ ఇంట్లో ఉండే వాళ్ళకి మానసిక సమస్యలు, ఆర్థికపరమైన సమస్యలు ఎదురవుతాయి. ఆగ్నేయ వీధి పోటు అయితే ఐశ్వర్యం పెరుగుతుంది.

Veedhi Potu what is the meaning and its effects
Veedhi Potu

పడమర వీధి పోటుకి అయితే చెడు ఫలితాలు ఎదురవుతాయి. అదే పశ్చిమ వాయువ్యం పోటు అయితే మాత్రం మంచిదే. దక్షిణ నైరుతి వీధి పోటు మాత్రం ఎంతో నీచమైనది. దీని వలన కొంచెం అసౌకర్యం కలుగుతుంది. అనారోగ్య సమస్యలు కూడా ఎక్కువ అవుతాయి.

వీధి పోట్ల ఫలితాలని లెక్కపెట్టేటప్పుడు ఎన్ని డిగ్రీల కోణంలో వీధి పోట్లు ఉన్నాయి, ఎదురుగా ఉన్న రోడ్డు కంటే మధ్యలో వచ్చిన రోడ్డు చిన్నదా లేదా పెద్దదా.. ఇటువంటివన్నీ కూడా చూసి వీధిపోట్లని చూస్తారు. వీలైనంత వరకు వీధి పోట్ల ఇళ్ళకి దూరంగా ఉంటే మంచిది. అలాంటి ఇళ్ళని మీరు కొనుక్కోవాల్సి వస్తే సరైన పండితుల్ని సంప్రదించడం మంచిది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment