వాస్తు టిప్‌.. రాక్ సాల్ట్ తో ఈ విధంగా చేస్తే ఇంట్లో ఎవ‌రూ అనారోగ్యాల బారిన ప‌డ‌రు..!

April 3, 2021 10:54 AM

సాధార‌ణంగా సీజన్లు మారిన‌ప్పుడ‌ల్లా ఇంట్లో అంద‌రికీ జ్వ‌రం, ద‌గ్గు, జలుబు వంటివి వ‌చ్చి పోతుంటాయి. అది స‌హ‌జ‌మే. అయితే ఇంట్లో త‌ర‌చూ అంద‌రూ అనారోగ్యాల బారిన ప‌డుతున్నారంటే ఆ ఇంట్లో వాస్తు దోషం ఉంద‌ని అర్థం చేసుకోవాలి. ఇందుకు గాను త‌గిన జాగ్ర‌త్త‌ల‌ను పాటించాల్సి ఉంటుంది. అయితే ఇంట్లోని కుటుంబ స‌భ్యులు త‌ర‌చూ అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డుతుంటే, అందుకు వాస్తు కార‌ణం అయితే ఆ దోషాన్ని తొల‌గించేందుకు రాక్ సాల్ట్ లేదా బ్లాక్ సాల్ట్ ఉప‌యోగ‌ప‌డ‌తాయి.

vastu tip do like this with rock salt in home to get rid of diseases

ఇంట్లో అనారోగ్యం బారిన ప‌డ్డ వ్య‌క్తి త‌న ఆహారంలో రాక్ సాల్ట్ లేదా బ్లాక్ సాల్ట్‌ను ఎక్కువ‌గా ఉపయోగించాలి. సాధార‌ణ ఉప్పు వాడ‌కాన్ని త‌గ్గించాలి. అలాగే వాస్తు ప్ర‌కారం పేషెంట్ బెడ్ రూమ్‌లో లేదా పేషెంట్ నిద్రించే బెడ్ వ‌ద్ద ఒక పాత్ర‌లో కొన్ని రాక్ సాల్ట్ ముక్క‌ల‌ను వేసి పెట్టాలి. ఆ పాత్ర‌ను తూర్పు వైపున‌ ఉంచాలి.

ఇలా చేయ‌డం వ‌ల్ల ఇంట్లో ఉన్న వాస్తు దోషం త‌గ్గుతుంది. అనారోగ్యాల బారిన ప‌డ‌కుండా ఉంటారు. ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీ పోతుంది. ఇత‌రులు అనారోగ్యాల బారిన ప‌డ‌కుండా ఉంటారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment