Rain In Dream : నిద్రపోయినప్పుడు సహజంగానే మనకు కలలు వస్తుంటాయి. కొన్ని కలలు మనకు మంచి అనుభూతిని అందిస్తాయి. కానీ కొన్ని కలలు మాత్రం విపరీతంగా భయపెడతాయి. దీంతో నిద్ర సరిగ్గా పట్టదు. ఇక మనం రోజూ కనే కలలు చాలా వరకు మనకు గుర్తుండవు. కేవలం ఒకటో రెండో కలలు మాత్రం మనకు గుర్తుంటాయి. ఇక స్వప్న శాస్త్రం ప్రకారం కలలకు కూడా అర్థాలు ఉంటాయి. నిద్రలో ఒక కల వస్తే అది మన జీవితంపై కూడా ప్రభావం చూపుతుందట. అందువల్ల ఎలాంటి కలలు వస్తే మన జీవితంలో ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
మీరు కలలో వర్షాన్ని చూసినా లేదంటే వర్షం పడుతున్నట్లు కల వచ్చినా అది ఎంతో శుభ శకునమట. ఇది మీకు భవిష్యత్తులో కలగబోయే మంచికి సూచన అని అర్థం. అలాగే స్వప్న శాస్త్రం ప్రకారం ఇలాంటి కల వస్తే మీరు త్వరలోనే శుభవార్త వింటారని అర్థం. మీ జీవితంలో ఏదో చెప్పుకోబోయే గొప్ప మార్పు చోటుచేసుకోబోతుందని తెలుసుకోవాలి. దీంతో మీ జీవితం కూడా మారిపోతుందట. అలాగే ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న పనులు కూడా పూర్తవుతాయట. కోర్టుల్లో ఉన్న కేసులు పరిష్కారం అవుతాయట. మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయట.
కలలో మీకు భారీ వర్షం కనబడితే అది మీకు ఇంకా ఎంతో మంచి శకునాన్ని అందిస్తుందట. దాని అర్థం ఏమిటంటే.. సాక్షాత్తూ లక్ష్మీదేవి ఆశీస్సులు మీపై ఉంటాయట. మీకు అంతులేని ధనం కలుగుతుందట. ఐశ్వర్యంలో మునిగి తేలుతారట. మీకున్న ఆర్థిక సమస్యలు అన్నీ పోతాయట. కొత్త మార్గాల్లో ఆదాయం వస్తుందట. ఇక మీరు వర్షంలో తడిసిపోయినట్లు కల వస్తే మీరు త్వరలోనే విజయం అందుకోబోతున్నారని అర్థం.
మీకు ఉన్న అతి పెద్ద సమస్యలు అన్నీ పోతాయని తెలుసుకోవాలి. అలాగే ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుందని, వ్యాపారంలో అయితే సక్సెస్ సాధిస్తారని తెలుసుకోవాలి. ఇక వర్షంలో తడిసినట్లు కల వస్తే మీకున్న ఆర్థిక సమస్యలు పోతాయని అర్థం. అలాగే మీ కుటుంబ సభ్యుల నుంచి మీరు శుభవార్త వింటారు. దీంతో మీ ఇంట్లో సంతోషం, అభివృద్ధి నెలకొంటాయి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…