Rain In Dream : వ‌ర్షంలో త‌డిసిన‌ట్లు లేదా వ‌ర్షం ప‌డిన‌ట్లు క‌ల వ‌చ్చిందా.. అయితే మీ ల‌క్ మార‌వ‌చ్చు.. ఏం జ‌రుగుతుందో చూడండి..!

March 30, 2024 1:31 PM

Rain In Dream : నిద్ర‌పోయిన‌ప్పుడు స‌హ‌జంగానే మ‌న‌కు క‌ల‌లు వ‌స్తుంటాయి. కొన్ని క‌ల‌లు మ‌న‌కు మంచి అనుభూతిని అందిస్తాయి. కానీ కొన్ని క‌ల‌లు మాత్రం విప‌రీతంగా భ‌య‌పెడ‌తాయి. దీంతో నిద్ర స‌రిగ్గా ప‌ట్ట‌దు. ఇక మ‌నం రోజూ క‌నే క‌ల‌లు చాలా వ‌ర‌కు మ‌న‌కు గుర్తుండ‌వు. కేవలం ఒక‌టో రెండో క‌ల‌లు మాత్రం మ‌న‌కు గుర్తుంటాయి. ఇక స్వ‌ప్న శాస్త్రం ప్ర‌కారం క‌ల‌ల‌కు కూడా అర్థాలు ఉంటాయి. నిద్ర‌లో ఒక క‌ల వ‌స్తే అది మన జీవితంపై కూడా ప్ర‌భావం చూపుతుంద‌ట‌. అందువ‌ల్ల ఎలాంటి క‌ల‌లు వ‌స్తే మ‌న జీవితంలో ఏం జ‌రుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

మీరు క‌ల‌లో వ‌ర్షాన్ని చూసినా లేదంటే వ‌ర్షం పడుతున్న‌ట్లు క‌ల వ‌చ్చినా అది ఎంతో శుభ శ‌కున‌మ‌ట‌. ఇది మీకు భ‌విష్య‌త్తులో క‌ల‌గ‌బోయే మంచికి సూచ‌న అని అర్థం. అలాగే స్వ‌ప్న శాస్త్రం ప్ర‌కారం ఇలాంటి క‌ల వ‌స్తే మీరు త్వ‌ర‌లోనే శుభ‌వార్త వింటార‌ని అర్థం. మీ జీవితంలో ఏదో చెప్పుకోబోయే గొప్ప మార్పు చోటుచేసుకోబోతుంద‌ని తెలుసుకోవాలి. దీంతో మీ జీవితం కూడా మారిపోతుంద‌ట‌. అలాగే ఎప్ప‌టి నుంచో పెండింగ్‌లో ఉన్న ప‌నులు కూడా పూర్త‌వుతాయ‌ట‌. కోర్టుల్లో ఉన్న కేసులు ప‌రిష్కారం అవుతాయ‌ట‌. మీరు అనుకున్న కోరిక‌లు నెర‌వేరుతాయ‌ట‌.

Rain In Dream do you know what happens must know it
Rain In Dream

క‌ల‌లో మీకు భారీ వ‌ర్షం క‌న‌బ‌డితే అది మీకు ఇంకా ఎంతో మంచి శ‌కునాన్ని అందిస్తుంద‌ట‌. దాని అర్థం ఏమిటంటే.. సాక్షాత్తూ ల‌క్ష్మీదేవి ఆశీస్సులు మీపై ఉంటాయ‌ట‌. మీకు అంతులేని ధ‌నం క‌లుగుతుంద‌ట‌. ఐశ్వ‌ర్యంలో మునిగి తేలుతార‌ట‌. మీకున్న ఆర్థిక స‌మ‌స్య‌లు అన్నీ పోతాయ‌ట‌. కొత్త మార్గాల్లో ఆదాయం వ‌స్తుంద‌ట‌. ఇక మీరు వ‌ర్షంలో త‌డిసిపోయిన‌ట్లు క‌ల వ‌స్తే మీరు త్వ‌ర‌లోనే విజ‌యం అందుకోబోతున్నారని అర్థం.

మీకు ఉన్న అతి పెద్ద స‌మ‌స్య‌లు అన్నీ పోతాయ‌ని తెలుసుకోవాలి. అలాగే ఉద్యోగంలో ప్ర‌మోష‌న్ ల‌భిస్తుంద‌ని, వ్యాపారంలో అయితే స‌క్సెస్ సాధిస్తార‌ని తెలుసుకోవాలి. ఇక వ‌ర్షంలో త‌డిసిన‌ట్లు క‌ల వ‌స్తే మీకున్న ఆర్థిక స‌మ‌స్య‌లు పోతాయ‌ని అర్థం. అలాగే మీ కుటుంబ స‌భ్యుల నుంచి మీరు శుభ‌వార్త వింటారు. దీంతో మీ ఇంట్లో సంతోషం, అభివృద్ధి నెల‌కొంటాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now