Business Idea : కొద్దిపాటి పెట్టుబడి పెట్టి.. కొద్దిగా శ్రమిస్తే.. ఎవరైనా సరే.. ఇంట్లోనే స్వయం ఉపాధిని పొందవచ్చు. అందుకు అనేక మార్గాలు ఉన్నాయి. వాటిల్లో కంప్యూటర్ ద్వారా చేసే ఎంబ్రాయిడరీ కూడా ఒకటి. దీనికి టైలరింగ్ నేర్చుకోవాల్సిన పనిలేదు. కంప్యూటర్ వాడడం తెలిస్తే చాలు.. చాలా సులభంగా ఎవరైనా.. ఈ బిజినెస్ చేయవచ్చు. దీంతో నెలకు రూ.వేలల్లో సంపాదించేందుకు అవకాశం ఉంటుంది. మరి ఇందుకు ఏమేం అవసరం అవుతాయో.. నెల నెలా ఎంత వరకు ఈ బిజినెస్ ద్వారా సంపాదించవచ్చో.. ఇప్పుడు తెలుసుకుందామా..!
కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేసేందుకు మెషిన్ల అవసరం ఉంటుంది. మార్కెట్‌లో మనకు రూ.92వేలు మొదలుకొని రూ.25 లక్షల విలువ చేసే భారీ మెషిన్లు అందుబాటులో ఉన్నాయి. బాగా పెట్టుబడి పెట్టి పెద్ద ఎత్తున బిజినెస్ చేయాలనుకునే వారు, ఆ సామర్థ్యం ఉన్నవారు పెద్ద మెషిన్లను కొనుగోలు చేయవచ్చు. ఇక ఈ మెషిన్లు ఇండియామార్ట్ వంటి ఈ-కామర్స్ సైట్లలో అందుబాటులో ఉన్నాయి. వాటిని కొనుగోలు చేస్తే తయారీదారులే స్వయంగా మన ఇంటికి వచ్చి వాటిని ఫిక్స్ చేసి.. వాటిని ఎలా ఉపయోగించాలో మనకు శిక్షణ ఇస్తారు.
కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మెషిన్లకు ఓ కంప్యూటర్ అటాచ్ అయి ఉంటుంది. దానికి కంపెనీ వారు ఇచ్చే పెన్‌డ్రైవ్‌ను పెట్టాలి. అందులో పలు రకాల డిజైన్లు ఉంటాయి. కస్టమర్లు ఎంచుకున్న డిజైన్‌ను అందులో ఫిక్స్ చేసి.. క్లాత్‌ను ఒక ఫ్రేమ్‌లో అమర్చి.. దాన్ని మెషిన్ నీడిల్ కింద సరైన పొజిషన్‌లో ఉంచితే చాలు.. దానంతట అదే స్టిచింగ్ అవుతుంది. ఇలా ఓ 60 నుంచి 90 నిమిషాల్లో చిన్న మెషిన్లపై కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేయవచ్చు. పెద్ద మెషిన్లపై ఈ పని 30 నిమిషాల్లోపే పూర్తవుతుంది. ఒకేసారి ఎక్కువ దుస్తులు లేదా క్లాత్‌పై పెద్ద మెషిన్ల ద్వారా ఎంబ్రాయిడరీ చేయవచ్చు. దీంతో నిత్యం ఎక్కువ మొత్తంలో సంపాదించేందుకు అవకాశం ఉంటుంది.
ఇక ఈ మెషిన్ల నిర్వహణకు కేవలం విద్యుత్ మాత్రమే ఖర్చు అవుతుంది. అలాగే భిన్నరకాల దారాలు, రంగుల దారాలు అవసరం అవుతాయి. కస్టమర్లు ఎంచుకునే డిజైన్‌ను బట్టి ముత్యాలు, పలు రకాల పూసలను అమర్చాల్సి ఉంటుంది కనుక.. వాటికి కూడా ఖర్చవుతుంది. ఈ క్రమంలో ఒక సాధారణ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మెషిన్ ద్వారా ఒక డిజైన్ చేస్తే కనీసం ఎంత లేదన్నా రూ.500 వరకు చార్జి చేయవచ్చు. అందులో ఖర్చులు పోను మనకు రూ.350 వరకు మిగులుతుంది. ఈ క్రమంలో నిత్యం 10 డిజైన్లు వేసినా.. రోజుకు రూ.3500 వరకు.. నెలకు రూ.1,05,000 వరకు సంపాదించవచ్చు. అలాగే మార్కెటింగ్ చేయగలిగే ఓపిక ఉంటే.. దుస్తుల షాపుల వారితో ఒప్పందం చేసుకుని ఆ మేర దుస్తులకు ఎంబ్రాయిడరీ చేసి.. డబ్బులు సంపాదించవచ్చు. ఇంటి దగ్గరే ఉండే మహిళలకు ఇది చక్కని స్వయం ఉపాధి అవుతుందని చెప్పవచ్చు.
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…