Lord Shani : శనివారం నాడు ఇలా చేస్తే.. కష్టాలన్నీ పోతాయి.. ఇక మీకు అన్నీ శుభాలే..!

July 15, 2023 2:48 PM

Lord Shani : ప్రతి ఒక్కరి లైఫ్ లో కూడా కష్టాలు కామన్ గా ఉంటాయి. కష్టాలు ఉన్నప్పుడు వాటిని ఎదుర్కొని, మంచి రోజులు రాబోతున్నాయి అని ధైర్యంగా ముందుకు వెళితే, కచ్చితంగా మనకి ఓ రోజు అనుకున్నది పూర్తవుతుంది. అయితే ఒక్కొక్కసారి ఎంత ప్రయత్నం చేస్తున్నా కూడా మనకి దురదృష్టమే కలుగుతుంది. మనం అనుకున్నవి ఏమీ కూడా జరగవు. ఎప్పుడు ఆటంకలే వస్తూ ఉంటాయి. నిజానికి ఒకసారి శని తగులుకుందంటే, ఎలాంటి పని కూడా జరగదు. అనుకున్న పనులు ఏమి శని కారణంగా పూర్తి కావు. అయితే శని ప్రభావం మన మీద పడడం వలన దురదృష్టమే మనకి కలుగుతూ ఉంటుంది.

కానీ దురదృష్టాన్ని కూడా అదృష్టం కింద మార్చుకోవచ్చు. శని కి కోపం వస్తే, మనల్ని నాశనం చేస్తాడు. శని కూడా ఇతర రాశుల వారితో ప్రయాణిస్తాడు. ఒక రాశి నుండి మరొక రాశికి శని రావడానికి రెండున్నర ఏళ్ళు పడుతుంది. కొంత మందికి శని వలన మంచి జరిగితే, కొంతమంది మాత్రం కఠిన పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. శని కారణంగా శారీరకంగా, ఆర్థికంగా, మానసికంగా కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

Lord Shani do like this on saturday to get rid of problems
Lord Shani

అన్నిట్లో కూడా అంతరాయం కలుగుతుంది. అయితే శని నివారణ చర్యలు గురించి ఇప్పుడు తెలుసుకోండి. వీటిని ఆచరిస్తే సంతోషమే కలుగుతుంది. అశుభ ప్రభావాలను వదిలించుకోవచ్చు. జీవితంలో సమస్యలు ఎదురవుతుంటే శనివారం లేదా సోమవారం రోజు గంగాజలంతో కడిగిన సత్ముఖి రుద్రాక్షని వేసుకోవాలి.

కొన్ని రోజుల్లో మీ సమస్యలన్నీ పోతాయి. పురాణాల ప్రకారం శని దేవుడు హనుమంతుని భక్తులని ఇబ్బంది పెట్టడు. కాబట్టి శనివారం హనుమంతుడిని పూజిస్తే, శని బాధలు పోతాయి. శనివారం రావి చెట్టుని పూజిస్తే కూడా శని బాధల నుండి బయటపడొచ్చు. శనివారం ఆవ నూనె దీపాన్ని రావి చెట్టు దగ్గర వెలిగిస్తే, ఇంకా మంచిది. శనివారం శని మంత్రాలని జపిస్తే కూడా ఈ బాధ ఉండదు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now