Morning : నిద్ర లేవ‌గానే వీటిని చూస్తే అంతా న‌ష్ట‌మే.. ద‌రిద్రం చుట్టుకుంటుంది..!

July 24, 2023 5:52 PM

Morning : ఉదయం నిద్ర లేచిన తర్వాత మనం పాటించే విషయాలు చాలా ఉన్నాయి. ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత మనం దేనినైతే మొదట చూస్తామో దాని ప్రభావం మనకు రోజంతా ఉంటుంది అని చాలా మంది నమ్ముతారు. పెద్దలైతే ఉదయం లేచిన వెంటనే దేవుడి ఫోటోని చూసి ఆ తర్వాత భూదేవికి నమస్కారం చేసుకుని నిద్ర లేవమని చెప్తూ ఉంటారు. ఉదయం నిద్ర లేచాక చాలామంది ఏదో ఒక వస్తువుని అలా కాసేపు చూస్తూ ఉంటారు. లేదంటే దేవుడి ఫోటోని చూస్తూ ఉంటారు.

కొంతమంది చేతికి ఉన్న ఉంగరాలని చూసి లేస్తూ ఉంటారు. కొందరైతే వాళ్ళ ముఖాలని వాళ్ళే చూసుకుని నిద్రలేస్తూ ఉంటారు. ఇలా ఒక్కొక్కరికీ ఒక్కో అలవాటు ఉంటుంది. అయితే ఈ అలవాటు ఉంటే మాత్రం దరిద్రం చుట్టుకుంటుందని పండితులు అంటున్నారు. నిద్ర లేవగానే పళ్ళు తోముకోకుండా చాలా మంది కాఫీ, టీ లను తాగుతూ ఉంటారు. అది మంచిది కాదు. అదే విధంగా దంతాలని శుభ్రం చేసుకునేటప్పుడు ఎవరూ చూడకపోవడం మంచిదట. కొంతమంది తిరుగుతూ పళ్ళు తోముకుంటారు. కొందరు ఎండ తగలాలని ఎండలో నిలబడి దంతాలని శుభ్రం చేసుకుంటుంటారు.

do not see these after waking up Morning
Morning

ఇలా చేయడం వలన సూర్యుడికి ఆగ్రహం కలుగుతుంది. డబ్బు కూడా విపరీతంగా ఖర్చు అవుతుందని పండితులు అంటున్నారు. ఎప్పుడైనా ఏదైనా చెడు కలిగితే ఈరోజు మనం ఎవరి మొహం మొదట చూశాము అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అయితే ఉదయం లేచాక బొట్టు లేని ఆడపిల్ల ముఖం అస్సలు చూడకూడదు. అదేవిధంగా స్త్రీలు ఉదయాన్నే నిద్ర లేచి వంటింట్లోకి వెళ్లకూడదు. స్త్రీలు ఉదయాన్నే శుభ్రం చేయని పాత్రలని చూడకూడదు. ఉదయం లేవగానే జంతువుల బొమ్మల్ని చూడడం కూడా మంచిది కాదు.

నిద్రలేచిన వెంటనే భూదేవికి నమస్కారం చేసుకోవాలి. మనం చేసే పాపాలు అన్నింటినీ భూదేవి మోస్తుంది. కనుక నిద్ర లేవగానే వెంటనే భూదేవికి నమస్కారం చేసుకోండి. నిద్రలేచిన వెంటనే వేదమంత్రాలు చదువుతున్న బ్రాహ్మణుడిని చూడడం చాలా మంచిది. దేవతలు కొలువై ఉండే గోవుని, తులసి మొక్కని నిద్రలేవగానే చూస్తే మంచి జరుగుతుంది. గుడి గోపురాన్ని, పర్వతాలని, సముద్రాన్ని చూస్తే కూడా అంతా శుభం కలుగుతుంది. బంగారాన్ని, దూడతో ఉన్న ఆవుని, ఎర్రచందనాన్ని చూసినా కూడా చక్కటి ఫలితం కనపడుతుంది. అగ్నిని చూసినా, యజ్ఞం చేసే వాళ్ళని చూసినా కూడా శుభమే.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment