Weights : ఈ ప్ర‌దేశంలో బ‌రువు పెట్టారో అంతే సంగ‌తులు.. ఏం జ‌రుగుతుందో తెలుసా..?

June 26, 2023 4:27 PM

Weights : ఏ దిక్కు లో వేటిని ఉంచాలి అనేది తెలుసుకుని, దాని ప్రకారం ఇంటిని నిర్మిస్తూ ఉంటారు. హిందూ సంప్రదాయాలో వాస్తు కి ఉన్న ప్రాధాన్యత గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. వాస్తు కి చాలా మంది విలువ ని ఇస్తారు. కొత్తగా ఆఫీసు కట్టాలన్నా, ఇల్లు, గుడి వంటివి నిర్మించాలన్నా కూడా కచ్చితంగా వాస్తు నియమాలని పాటిస్తారు. గాలి, వెలుతురు వచ్చేటట్టు నిర్మించడంతో పాటుగా ఏ దిక్కున ఏం ఉంటే మంచిదనేది కూడా చూస్తారు.

ఇలా వీటన్నిటిని చూసే నిర్మిస్తారు. ఈరోజు ముఖ్యంగా ఈశాన్యం గురించి చూద్దాం. ఎక్కువ మంది ఈశాన్యంలో బరువులు పెట్టకూడదని చెప్తూ ఉంటారు. ఈశాన్యంలో కనుక బరువు పెడితే ధన నష్టం కలుగుతుందని అంటారు. ఈశాన్యంలో ఈశ్వరుడు కొలవై ఉంటారు. ఈశాన్యంలో బరువులు ని కానీ ఏదైనా వస్తువులను కానీ పెట్టడం వలన ఈశాన్యం వైపు మూసుకుపోతుంది.

do not put weights in north east corner
Weights

దాంతో గాలి వెల్తురు సరిగ్గా రావు. ప్రాతఃకాలంలో సూర్యోదయం సమయంలో ఈశాన్యం తూర్పు నుండి సూర్య రష్మి ఇంట్లోకి రావడం జరుగుతుంది. దాని వలన ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. అందుకే, ఈశాన్యం వైపు ఏమి పెట్టకుండా ఖాళీగా ఉంచాలని అంటారు. ఈశాన్యం బాగా సున్నితమైనది. అందుకని గరిగిపోచ బరువు కూడా ఉండకూడదు అని పండితులు అంటారు.

ఈశాన్యంలో ద్వారం పెడితే మంచిది. ఒకవేళ వీలు కాకపోతే, పెద్ద పెద్ద కిటికీలనైనా పెట్టొచ్చు. ఈశాన్యం నుండి వచ్చే గాలి వలన మన మనసు చాలా తేలికగా అవుతుంది. ఆరోగ్యంగా కూడా ఉండొచ్చు. అందుకే ఈ కారణంగానే ఈశాన్యం వైపు బరువులు పెట్టకూడదని అంటారు. కావాలంటే ఈసారి మీరు ఈ మార్పులు చేసి చూడండి. మీ మనసు తేలికగా అవ్వడం ఖాయం.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment