ఈ వ‌స్తువుల‌ను అస‌లు ఉచితంగా తీసుకోరాదు.. అలా చేస్తే అరిష్టం..!

May 16, 2023 11:00 AM

కొందరికి తమ వస్తువులను ఇతరులతో పంచుకునే అలవాటు ఉంటుంది. బట్టలు, వాచీలు, బూట్లను తమ ఫ్రెండ్స్ కు ఇస్తారు. మిత్రుల వీరు ధరిస్తారు. కానీ అలా చేస్తే అశుభమట. మరి ఏ వస్తువులను ఇతరులతో షేర్ చేసుకోకూడదో ఇప్పుడు తెలుసుకుందామా. ఉప్పు నేరుగా ఇతరుల చేతికి ఇవ్వకూడదని ముఖ్యంగా రాత్రి వేళల్లో ఉప్పు ఇతరులకు ఇవ్వకూడదని శాస్త్రం చెబుతోంది. ఉప్పు లక్ష్మీ దేవి స్వరూపం. అందుకే నేలపై పడితే తొక్కకూడదు.

ఇక నల్ల నువ్వులను కూడా ఉచితంగా తీసుకోకూడదు. నల్ల నువ్వులను ఉచితంగా తీసుకోవడం వలన శని ప్రభావం మనపై పడుతుంది. అలాగే వీటిని ఎవరికీ దానం చేయకూడదు. ఇనుము వస్తువులను కూడా దానంగా తీసుకోకూడదు. ఒకవేళ ఏమైనా తీసుకోవాల్సి వచ్చినా దానికి ఎంత డబ్బు చెల్లించాలో అంతా చెల్లించి తీసుకోవాలి. ఇనుము కూడా శ‌నికి చిహ్నం. అందుకే శనివారం పూట ఇనుము తెచ్చుకోవడం చాలా తప్పు. అలాగే సూది, చేతి రుమాలును కూడా ఇతరులకు ఉచితంగా ఇవ్వకూడదు.

do not give or take these items for free

మంచి నూనెను కూడా చేతికి ఇవ్వకూడదని చెబుతారు. వంటకు వాడే నూనెను ఎవరి వద్ద నుంచి అయినా ఉచితంగా తీసుకోకూడదు. ఒకవేళ తీసుకోవాల్సిన అవసరం వచ్చినా వారికి ఎంతో కొంత డబ్బు చెల్లించి తీసుకోవాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment