Sunset : సూర్యాస్త‌మ‌యం అయ్యాక ఎట్టి ప‌రిస్థితిలోనూ ఈ 5 ప‌నుల‌ను అస‌లు చేయ‌కండి..!

September 23, 2023 1:17 PM

Sunset : అందరూ సంతోషంగా ఉండాలని, అంతా మంచే జరగాలని అనుకుంటుంటారు. అంతా మంచి జరిగి, అన్ని బాగుండాలంటే, కొన్ని తప్పుల‌ని మనం చేయకూడదు. మనం తెలియకుండా చేసే చిన్న చిన్న పొరపాట్లు, తప్పుల‌ వలన మనకి ఎంతో నష్టం ఉంటుంది. ముఖ్యంగా సూర్యాస్తమయం అయిన తర్వాత ఈ తప్పులను అస్సలు చేయకూడదు. ఇలాంటి తప్పులను కనుక సూర్యాస్తమయం అయ్యాక చేస్తే దురదృష్టం కలుగుతుంది. ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది.

వాస్తు శాస్త్రం ప్రకారం సూర్యాస్తమయం అయిన తర్వాత ఈ తప్పులని అస్సలు చేయకూడదు. సూర్యాస్తమయం అయ్యాక ఈ పొరపాట్లు చేసినట్లయితే కచ్చితంగా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. సూర్యాస్తమయం అయిన తర్వాత జుట్టు కత్తిరించుకోవడం, గోళ్ళని కత్తిరించుకోవడం మంచిది కాదు. ఇలాంటి తప్పులను చేయడం వలన లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుంది. లక్ష్మీదేవి ఇంటి నుండి వెళ్లిపోతుంది. లక్ష్మీదేవి వెళ్ళిపోయి ఇబ్బందుల్ని కలిగిస్తుంది.

do not do these 5 works after Sunset
Sunset

చాలామంది రాత్రి పూట వండుకున్న పాత్రలను, తినేసిన కంచాలని వాటిని అలా వదిలేస్తూ ఉంటారు. వాటిని శుభ్రం చేసుకోవాలి. ఉదయం వరకు అలా ఉంచకూడదు. అలా మీరు వాటిని వదిలేస్తే లక్ష్మీదేవికి ఆగ్రహం కలిగి ఇంటి నుండి వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ పొరపాటును కూడా అసలు చేయకండి. సూర్యాస్తమయం అయ్యాక అసలు బట్టలను ఉతకడం, బట్టల్ని ఆరేయడం కూడా మంచిది కాదు. ఇలా చేయడం వలన ఇంటికి నెగెటివ్ ఎనర్జీ వస్తుంది.

పాజిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. కాబట్టి ఈ పొరపాటు కూడా జరగకుండా చూసుకోవాలి. తల స్నానం చేయడం, తల దువ్వుకోవడం, జుట్టు వదిలేసి నిద్రపోవడం సూర్యాస్తమయం అయిన తర్వాత చేయకూడదు. ఈ తప్పు చేస్తే కూడా దురదృష్టం కలుగుతుంది. లక్ష్మీదేవికి కోపం వస్తుంది. సూర్యాస్తమయం అయ్యాక అస్సలు ఇంటిని కూడా శుభ్రం చేసుకోకూడదు. ఇల్లు తుడవడం వంటివి కూడా తప్పు. ఇటువంటి వాటిని సూర్యాస్తమయం అయ్యాక జరగకుండా చూసుకోవాలి. లేదంటే సమస్యలు తప్పవు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment