మ‌రో 7 రోజుల్లో ఈ రాశుల వారికి ధ‌న‌యోగం ప‌ట్ట‌బోతోంది..!

September 12, 2023 11:38 AM

సూర్యుడు గ్రహాలకి రాజు. ఈ నెల 17న ఉదయం 7:11 గంటలకి కన్యా రాశిలోకి సూర్యుడు ప్రవేశించబోతున్నాడు. దీంతో కొన్ని రాశుల వాళ్ళకి శుభ ఫలితాలు కలుగుతున్నాయి. మరి ఏ రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితం ఉంటుందనేది ఇప్పుడు తెలుసుకుందాం. మరి మీ రాశికి కూడా అదృష్టం కలగబోతుందో లేదో చూసుకోండి. కన్య రాశిలోకి సూర్యుడు ప్రవేశించడం వలన సెప్టెంబర్ 17 తర్వాత వృషభ రాశి వారికి మంచి జరగనుంది.

వృషభ రాశి వారికి అదృష్టం కలిసి రాబోతోంది. నూతన ఆదాయ మార్గాలని, ఉద్యోగ అవకాశాలని వృషభ రాశి వాళ్ళు పొందుతారు. కర్కాటక రాశి వారికి కూడా మంచి జరగబోతుంది. కర్కాటక రాశి వాళ్ళకి కెరియర్ లో మార్పు రాబోతుంది. కన్య రాశిలో సూర్యుడి ప్రవేశం ఫలితంగా కర్కాటక రాశి వాళ్ళకి ఉద్యోగంలో ఇంక్రిమెంట్లు లభించే అవకాశం ఉంది. ఆర్థిక బాధలు తొలగి పోతాయి. ఉన్నత స్థాయికి చేరుకోగలరు.

after 7 days these zodiac signs people will get wealth

కన్య రాశిలోకి సూర్యుడు ప్ర‌వేశించడం వలన మకర రాశి వాళ్ళకి మంచి రోజులు రాబోతున్నాయి. మకర రాశి వాళ్ళకి ఎలాంటి ప్రయోజనం ఉంటుంది అనేది చూస్తే..  ఆరోగ్యం మెరుగు పడుతుంది. వ్యాపారాల్లో లాభాలు, కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. కన్య రాశిలో సూర్యుడి సంచారం వలన వృశ్చిక రాశి వాళ్ళకి కూడా మంచి జరగబోతుంది. శ్రమకి తగ్గ ఫలితం ఉంటుంది.

బంధుమిత్రులు మీకు అండగా ఉంటారు. అనుకూలంగా మీకు ఉంటుంది. కుటుంబ సభ్యుల నుండి ప్రోత్సాహం కూడా మీకు లభిస్తుంది. ఇలా ఈ రాశుల వాళ్ళకి మంచి ఫలితం ఉండబోతోంది. చేస్తున్న ప్రయత్నాన్ని ఆపకండి. మంచి రోజులు రాబోతున్నాయి కాబట్టి కచ్చితంగా అనుకున్నది పూర్తవుతుంది. కష్టాల నుండి బయటకు వచ్చి సంతోషంగా జీవించొచ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now