రైతులకు శుభవార్త.. సులభంగా రూ.3 లక్షల రుణం పొందే అవకాశం.. ఎలాగంటే?

July 24, 2021 10:31 PM

బ్యాంకుల నుంచి రుణాలు పొందాలనుకునే రైతులకు ప్రభుత్వం శుభవార్తను తెలిపింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రైతులకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ప్రతి ఏటా ఆరు వేల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు.ఈ విధంగా ఈ ఆరు వేల రూపాయలను పొందే రైతులు ఎంతో సులభంగా బ్యాంకుల నుంచి 3 లక్షల వరకు రుణాలు పొందే అవకాశాన్ని కల్పిస్తోంది.

పీఎం కిసాన్ స్కీమ్ లబ్ధిదారులు ఎంతో సులభంగా కిసాన్ క్రెడిట్ కార్డును పొందవచ్చు. ఒకవేళ ఈ కార్డు లేకపోతే వెంటనే బ్యాంకుకు వెళ్లి కార్డు కోసం అప్లై చేసుకోండి. ఈ కార్డు అప్లై చేసుకోవడం కోసం ఆధార్, పాన్, బ్యాంక్ పాస్ బుక్, పొలం పాస్ బుక్ వంటివి అవసరం అవుతాయి.ఈ కార్డు ద్వారా రైతులు తక్కువ వడ్డీకే మూడు లక్షల రూపాయల వరకు రుణాలు పొందే అవకాశాన్ని కల్పించింది.

కిసాన్ క్రెడిట్ కార్డ్ ఉన్న రైతులు 3 లక్షల వరకు రుణం తీసుకోవచ్చు. దీనికి 9 శాతం వడ్డీ పడగా, ఇందులో రెండు శాతం సబ్సిడీ పోగా మనకు 7 శాతం వడ్డీ మాత్రమే పడుతుంది. అయితే సరైన సమయానికి మనం అప్పు చెల్లిస్తే ఇందులో మూడు శాతం వడ్డీ తగ్గుతుంది . అంటే మనం కేవలం 4 శాతం వడ్డీతో మూడు లక్షల రూపాయలను రుణంగా పొందే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పిస్తుంది. మీకు కిసాన్ కార్డు లేకపోతే వెంటనే కార్డు అప్లై చేసుకొని ఈ అద్భుతమైన అవకాశాన్ని పొందవచ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment