కరోనా వల్ల చాలా మంది ఉద్యోగాలు, ఉపాధిని కోల్పోయారు. దీంతో ప్రస్తుత తరుణంలో చాలా మందికి పూట గడవడం కష్టంగా మారింది. ఆర్థిక సమస్యలు సరే సరి. చిన్న పని కూడా దొరకని పరిస్థితి నెలకొంది. అయితే ఏదైనా చిన్నగా వ్యాపారం చేయాలనుకునే వారు డబ్బులు లేకపోతే చింతించాల్సిన పనిలేదు. కింద తెలిపిన 6 ప్రభుత్వ పథకాల ద్వారా సులభంగా రుణాలను పొందవచ్చు. మరి ఆ పథకాలు ఏమిటంటే..
ఈ పథకం కింద కనీసం రూ.10 లక్షల నుంచి గరిష్టంగా రూ.25 లక్షల వరకు రుణం ఇస్తారు. MSME లకు ఈ రుణ సహాయం అందజేస్తారు. తీసుకున్న రుణానికి 36 నెలల వరకు మారటోరియం సౌకర్యం లభిస్తుంది. 10 ఏళ్ల లోపు రుణాన్ని చెల్లించాలి.
సూక్ష్మ, చిన్న తరహా వ్యాపారులకు ఈ పథకం కింద రుణం వస్తుంది. దీని కింద గరిష్టంగా రూ.2 కోట్ల వరకు రుణం పొందవచ్చు. లబ్దిదారులు 15 శాతం మొత్తంతో వ్యాపారం ప్రారంభిస్తే 85 శాతం మేర డబ్బును రుణం కింద ఇస్తారు.
ఈ స్కీమ్ చిరు వ్యాపారుల కోసం ఉద్దేశించబడింది. దీని కింద రూ.10వేల రుణం ఇస్తారు. ఏడాది లోగా చెల్లించాలి.
ఇందులో 3 రకాల విభాగాల్లో లోన్లు ఇస్తారు. శిశు విభాగం కింద రూ.50వేల లోపు వరకు రుణాలను ఇస్తారు. కిశోర్ విభాగం కింద రూ.50వేల నుంచి రూ.5 లక్షల వరకు రుణాన్ని ఇస్తారు. తరుణ్ విభాగం కింద రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు రుణం ఇస్తారు. అనేక బ్యాంకులు ఈ రుణాలను అందిస్తున్నాయి. బ్యాంకులను బట్టి వడ్డీ రేట్లు మారుతాయి.
ఈ పథకంలో భాగంగా రూ.10 లక్షల నుంచి రూ.1 కోటి వరకు రుణాలను ఇస్తారు. అయితే ఈ స్కీమ్ కింద రుణం పొంది వ్యాపారం ప్రారంభిస్తే అందులో భాగస్వాములుగా ఎస్‌సీ, ఎస్టీ విభాగాలకు చెందిన వారు ఉండాలి. వారి వాటా 51 శాతంగా ఉండాలి. లోన్ తీసుకున్నాక 7 ఏళ్ల లోపు చెల్లించాలి. అప్పటికి ఇంకా ఏమైనా బాకీ ఉంటే అదనంగా మరో 18 నెలల పాటు రుణాన్ని చెల్లించే కాలాన్ని పొడిగిస్తారు.
ఈ స్కీమ్ కింద 18 నుంచి 35 ఏళ్ల లోపు వయస్సు వారు రుణం కోసం దరఖాస్తు చేయవచ్చు. ఎస్సీ, ఎస్‌టీలు, మహిళలు, ఎక్స్ సర్వీస్‌మెన్, అంగ వైకల్యం ఉన్నవారికి అయితే 45 ఏళ్ల వరకు అవకాశం ఉంటుంది. ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా ఇనిస్టిట్యూట్‌లో ఏదైనా విభాగంలో ట్రేడ్ సర్టిఫికెట్ కోర్సును కనీసం 6 నెలల పాటు అయినా చేసి ఉండాలి. ఏడాది ఆదాయం రూ.40వేలు మించరాదు. వీరికి రూ.10 లక్షల వరకు రుణం లభిస్తుంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…