మొబైల్స్ తయారీదారు రియల్‌మి కొత్తగా రియల్‌మి 8ఎస్ 5జి పేరిట ఓ నూతన స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేసింది. ఇందులో 6.5 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్ కలిగిన ఎల్‌సీడీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ ఉంది. అందువల్ల డిస్‌ప్లే క్వాలిటీగా ఉంటుంది.
ఈ ఫోన్‌లో మీడియాటెక్‌కు చెందిన డైమెన్సిటీ 810 ప్రాసెసర్‌ను అమర్చారు. అందువల్ల 5జి సేవలను ఉపయోగించుకోవచ్చు. 6/8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఆప్షన్‌లో ఈ ఫోన్ విడుదలైంది. మెమొరీని కార్డు ద్వారా 1టీబీ వరకు పెంచుకోవచ్చు. ఇక ఈ ఫోన్‌లో అదనపు ర్యామ్‌ను మరో 5జీబీ వరకు వేసుకోవచ్చు. అందుకు అవకాశం కల్పించారు.
ఈ ఫోన్‌లో వెనుక వైపు 64 మెగాపిక్సల్ భారీ కెపాసిటీ ఉన్న కెమెరా ఉండగా, దీనికి తోడు మరో 2 మెగాపిక్సల్ బ్లాక్ అండ్ వైట్ కెమెరా, 2 మెగాపిక్సల్ మాక్రో కెమెరాలను ఏర్పాటు చేశారు. ముందు వైపు 16 మెగాపిక్సల్ కెమెరా ఉంది. ఈ ఫోన్‌లో డ్యుయల్ సిమ్‌లను వేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ 11 ఓఎస్ లభిస్తుంది.
ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఈ ఫోన్‌లో పక్క వైపున ఏర్పాటు చేశారు. 5జి, డ్యుయల్ 4జి వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.1, యూఎస్‌బీ టైప్ సి ఫీచర్లను ఇందులో అందిస్తున్నారు. ఈ ఫోన్‌లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. దీనికి ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ లభిస్తోంది.
రియల్‌మి 8ఎస్ 5జి స్మార్ట్ ఫోన్‌కు చెందిన 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.17,999 ఉండగా, 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.19,999గా ఉంది. ఈ ఫోన్‌ను సెప్టెంబర్ 13వ తేదీ నుంచి విక్రయిస్తారు. రియల్‌మి ఆన్ లైన్ స్టోర్‌తోపాటు ఫ్లిప్‌కార్ట్‌లో, ఇతర ఆఫ్‌లైన్ స్టోర్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది. హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ కార్డులతో రూ.1500 డిస్కౌంట్ పొందవచ్చు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…