అక్టోబ‌ర్ 2021లో బ్యాంకుల‌కు ఉన్న సెల‌వులు ఇవే..!

September 25, 2021 9:29 PM

సాధార‌ణంగా ప్ర‌తి నెల‌లో బ్యాంకుల‌కు కొన్ని రోజుల పాటు సెల‌వులు వ‌స్తుంటాయి. అయితే అక్టోబ‌ర్ నెల‌లో పండుగ‌ల సీజ‌న్ క‌నుక ఈసారి స‌హ‌జంగానే సెల‌వుల సంఖ్య ఎక్కువ‌గా ఉంది. అక్టోబ‌ర్ నెల‌లో బ్యాంకుల‌కు ఏకంగా 21 రోజులు సెల‌వులు ఉండ‌నున్నాయి. మ‌రి ఏయే తేదీల్లో సెల‌వులు ఉన్నాయో.. ఇప్పుడు తెలుసుకుందామా..!

అక్టోబ‌ర్ 2021లో బ్యాంకుల‌కు ఉన్న సెల‌వులు ఇవే.. మొత్తం 21 రోజులు సెల‌వులే..!

అక్టోబ‌ర్ 1వ తేదీన బ్యాంకుల‌కు ఆర్థిక సంవ‌త్స‌రం స‌గం పూర్త‌వుతుంది. ఈ సెల‌వు గాంగ్‌ట‌క్‌లో ఉంటుంది. అక్టోబ‌ర్ 2న గాంధీ జ‌యంతి. అక్టోబ‌ర్ 3 ఆదివారం. అక్టోబ‌ర్ 6న మ‌హాల‌య అమావాస్య‌. ఈ రోజు అగ‌ర్త‌ల‌, బెంగ‌ళూరు, కోల్‌క‌తాల‌లో సెల‌వులు ఉంటాయి. అక్టోబ‌ర్ 7న ఇంఫాల్‌లో మీరా కావోరెన్ హౌబా సెల‌వు. అక్టోబ‌ర్ 9న రెండో శ‌నివారం. 10వ తేదీన ఆదివారం.

అక్టోబ‌ర్ 12న దుర్గాపూజ‌, 13న మ‌హా అష్ట‌మి, 14న ద‌స‌రా, అక్టోబ‌ర్ 15వ తేదీన దుర్గా పూజ‌, 16న గాంగ్‌ట‌క్‌లో దుర్గా పూజ‌, అక్టోబ‌ర్ 17న ఆదివారం. 18వ తేదీన గువాహ‌తిలో క‌తి బిహు సెల‌వు. 19న ఈద్‌-ఇ-మిలాద్‌, 20వ తేదీన మ‌హ‌ర్షి వాల్మీకి జ‌యంతి. 22వ తేదీన జ‌మ్మూ, శ్రీ‌న‌గ‌ర్‌ల‌లో ఈద్‌-మిలాద్‌. 23న నాలుగో శ‌నివారం. 24 ఆదివారం. అక్టోబ‌ర్ 26వ తేదీన జ‌మ్మూ, శ్రీ‌న‌గ‌ర్‌ల‌లో సెల‌వు. 31వ తేదీ ఆదివారం.

ఈ విధంగా అక్టోబ‌ర్ లో మొత్తం 21 రోజుల పాటు బ్యాంకుల‌కు సెల‌వులు ఉండ‌నున్నాయి. క‌నుక సెల‌వుల‌కు అనుగుణంగా లావాదేవీల‌ను ప్లాన్ చేసుకుంటే ఆటంకం క‌ల‌గ‌కుండా చూసుకోవ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment