పాన్‌, ఆధార్‌ల‌ను లింక్ చేయక‌పోతే రూ.1000 ఫైన్.. రెండింటినీ ఇలా లింక్ చేయండి..!

March 30, 2021 12:09 PM

దేశంలోని పాన్ కార్డు దారులు త‌మ పాన్ ను ఆధార్‌తో అనుసంధానించేందుకు కేంద్రం ఇప్ప‌టికే ప‌లు మార్లు గడువును పెంచిన విష‌యం విదిత‌మే. క‌రోనా నేప‌థ్యంలో, ప‌లు ఇత‌ర కార‌ణాల వ‌ల్ల ఆ గ‌డువును పెంచుతూ పోతున్నారు. అయితే మళ్లీ క‌రోనా ప్ర‌భావం ప్రారంభమైన నేప‌థ్యంలో ఆ గ‌డువును ఇంకా పొడిగించే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే ఎక్స్‌పైర్ అయిన డ్రైవింగ్ లైసెన్స్‌లు, వాహ‌న ధ్రువ‌ప‌త్రాల గడువును కేంద్రం జూన్ 30వ తేదీ వ‌ర‌కు పెంచింది. దీంతో పాన్-ఆధార్ అనుసంధానానికి గ‌డువును కూడా పెంచుతార‌ని తెలుస్తోంది. అయితే గ‌డువు పెంచినా, పెంచక‌పోయినా క‌చ్చితంగా ఎవ‌రైనా సరే త‌మ పాన్‌ను ఆధార్‌తో అనుసంధానించాలి. లేదంటే రూ.1000 జ‌రిమానా విధిస్తారు.

rs 1000 if you do not link pan and aadhar know how to link them

కేంద్రం ఇటీవ‌లే ఫైనాన్స్ బిల్ 2021ని లోక్‌స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్టింది. దీన్ని ఇంకా అమ‌లు చేయ‌లేదు. కానీ ఈ బిల్లుకు ఆమోదం ల‌భించింది. అయితే ఈ బిల్లును అమ‌లు చేస్తే పాన్‌, ఆధార్‌ల‌ను గ‌డువులోగా అనుసంధానం చేయ‌ని వారికి రూ.1000 జ‌రిమానా విధిస్తారు. క‌నుక పాన్‌-ఆధార్‌ల‌ను లింక్ చేయాల్సి ఉంటుంది. ఇక కింద తెలిపిన స్టెప్స్ పాటిస్తే మీ పాన్‌ను ఆధార్‌తో సుల‌భంగా అనుసంధానం చేయ‌వచ్చు.

పాన్-ఆధార్‌ల‌ను ఈ విధంగా అనుసంధానం చేయండి

1. ఇంట‌ర్నెట్ బ్రౌజ‌ర్‌ను పీసీలో ఓపెన్ చేసి అందులో https://www.incometaxindiaefiling.gov.in/home అనే ఇన్‌క‌మ్‌ట్యాక్స్ విభాగ వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి.

2. అక్క‌డ పేజీకి ఎడ‌మ భాగంలో ఉండే Quick Links అనే సెక్ష‌న్‌లోని Link Aadhaar అనే ఆప్ష‌న్‌పై క్లిక్ చేయాలి.

3. త‌రువాత వ‌చ్చే పేజీలో మీ పాన్, ఆధార్ నంబ‌ర్ల వివ‌రాలు, పేరును న‌మోదు చేయాలి. ఆధార్ లో ఉన్న‌ట్లు పేరును తెల‌పాల్సి ఉంటుంది.

4. ఆధార్ కార్డులో కేవ‌లం పుట్టిన సంవ‌త్స‌రం మాత్ర‌మే ఉంటే చెక్ బాక్స్‌లో క్లిక్ చేయాలి. త‌రువాత యుఐడీఏఐతో ఆధార్ వివ‌రాల‌ను ధ్రువీక‌రించేందుకు చెక్‌బాక్స్‌లో క్లిక్ చేయాలి.

5. అనంత‌రం కాప్చా కోడ్‌ను ఎంట‌ర్ చేయాలి.

6. త‌రువాత Link Aadhaar అనే ట్యాబ్‌పై క్లిక్ చేయాలి. దీంతో ప్ర‌క్రియ పూర్త‌వుతుంది.

ఇలా పాన్‌, ఆధార్‌ల‌ను అనుసంధానం చేయ‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment