రూ.500 నోట్ల గురించి కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన ఆర్‌బీఐ.. కచ్చితంగా తెలుసుకోవాల్సిన విష‌యం..

June 26, 2021 4:30 PM

సామాజిక మాధ్య‌మాల్లో ప్ర‌స్తుతం ఫేక్ న్యూస్ ఎలా వేగంగా వ్యాప్తి చెందుతున్నాయో అంద‌రికీ తెలిసిందే. అలాంటి వార్త‌ల‌ను చూసి చాలా మంది నిజ‌మే అని న‌మ్ముతున్నారు. దీంతో న‌ష్ట‌పోతున్నారు. ఇక తాజాగా ఇంకో ఫేక్ వార్త వైర‌ల్ గా మారింది. అదేమిటంటే..

rbi important news on rs 500 notes

రూ.500 నోట్ల‌పై గాంధీ బొమ్మ‌కు ద‌గ్గ‌ర‌గా గ్రీన్ క‌ల‌ర్ లో స్ట్రిప్ ఉంటుంది క‌దా. అయితే కొన్ని నోట్ల‌కు ఆ స్ట్రిప్ ద‌గ్గ‌ర‌గా, కొన్ని నోట్ల‌కు దూరంగా ఉంటుంది. ఆర్‌బీఐ కొన్ని నోట్ల‌ను అలా ప్రింట్ చేస్తోంది. వాటిల్లో త‌ప్పేమీ లేదు. వాటిని ఎవ‌రైనా వాడుకోవ‌చ్చు. చెల్లుతాయి. కానీ సోష‌ల్ మీడియాలో మాత్రం.. గాంధీ బొమ్మ‌కు ద‌గ్గ‌ర‌గా గ్రీన్ స్ట్రిప్ ఉంటే అలాంటి రూ.500 నోట్ల‌ను తీసుకోకూడ‌ద‌ని ప్ర‌చారం చేస్తున్నారు. కానీ దీనిపై ఆర్‌బీఐ స్ప‌ష్ట‌తను ఇచ్చింది.

గాంధీ బొమ్మ‌కు గ్రీన్ స్ట్రిప్ ద‌గ్గ‌ర‌గా లేదా దూరంగా ఉన్నా ఆ నోట్లు చెల్లుతాయ‌ని, వాటిపై ఎలాంటి అపోహ‌లు, అనుమానాలు పెట్టుకోవాల్సిన ప‌నిలేద‌ని ఆర్‌బీఐ స్ప‌ష్టం చేసింది. క‌నుక సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం అవుతున్న ఆ వార్త‌లో నిజం లేద‌ని, అంతా ఫేక్ అని తేల్చింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment