బ్యాంక్ రుణ గ్రహీతలకు శుభవార్త.. 6 నెలలు వాయిదా కట్టకుండా రూ.5 లక్షల వరకు రుణం..

July 15, 2021 11:36 AM

కరోనా ప్రభావం వల్ల ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ బ్యాంకు నుంచి రుణం  తీసుకోవాలనుకుంటున్నారా..? అయితే మీకు ఇది శుభవార్త అని చెప్పవచ్చు. ఈ విధమైనటువంటి ఆర్థిక సమస్యలతో బాధపడేవారికి బ్యాంకులు కరోన పర్సనల్ లోన్ సౌకర్యం కల్పించింది. బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్లకు కోవిడ్ రుణాలను అందిస్తోంది.

ఈ లోన్ పొందడానికి అందరికీ అవకాశం లేదు.కేవలం బ్యాంక్ ఆఫ్ ఇండియాలో శాలరీ అకౌంట్ కలిగిన వారికి మాత్రమే ఈ వెసులుబాటును కల్పించింది. అదేవిధంగా ఇదివరకు ఎవరైతే పర్సనల్ లోన్, హోమ్ లోన్ తీసుకుని ఉంటారో అలాంటి వారికి కూడా ఈ అవకాశాన్ని కల్పించింది.

బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్ లు కోవిడ్ రుణాల కింద రూ. 5 లక్షల వరకు రుణం పొందవచ్చు. ఈ విధంగా బ్యాంకు నుంచి పొందిన రుణాన్ని కస్టమర్లు మూడు సంవత్సరాలుగా చెల్లించాలి. అయితే ఈ రుణాన్ని తీసుకున్న మొదటి ఆరు నెలల వరకు ఎలాంటి వాయిదాలు కట్టవలసిన అవసరం లేదు. ఈ విధంగా తీసుకున్న రుణాలపై బ్యాంక్ ఆఫ్ ఇండియా 6.85 శాతం వడ్డీని వసూలు చేస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

3 thoughts on “బ్యాంక్ రుణ గ్రహీతలకు శుభవార్త.. 6 నెలలు వాయిదా కట్టకుండా రూ.5 లక్షల వరకు రుణం..”

Leave a Comment