పోస్టాఫీస్ అందిస్తున్న లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్.. అనేక ప్రయోజనాలు.. లోన్ సౌక‌ర్యం..

August 17, 2021 9:56 PM

దేశంలో 19 సంవత్సరాల నుండి 55 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులు ఇండియన్ డాక్ కు చెందిన గ్రామ సంతోష్ పాలసీని తీసుకోవచ్చు. పాలసీ మూడేళ్లు పూర్తయిన తర్వాత మీరు దాని స‌హాయంతో రుణం కూడా తీసుకోవచ్చు.

పోస్టాఫీస్ అందిస్తున్న లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్.. అనేక ప్రయోజనాలు.. లోన్ సౌక‌ర్యం..

పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది భారత ప్రభుత్వానికి చెందిన జీవిత బీమా పథకం. గ్రామ్ సంతోష్ అనేది ఇండియా పోస్ట్ కు చెందిన‌ ఎండోమెంట్ ప్లాన్. ఈ పథకం ప్రధాన స‌దుపాయం ఏమిటంటే.. ఇది రూ.10 లక్షల వరకు బీమా మొత్తాన్ని అందిస్తుంది.

19 సంవత్సరాల నుండి 55 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులు ఇండియన్ డాక్ గ్రామ సంతోష్ పాలసీని తీసుకోవచ్చు. పాలసీ మూడేళ్లు పూర్తయిన తర్వాత దాంతో రుణం కూడా తీసుకోవచ్చు. ఈ పథకం కింద ముందుగా నిర్ణయించిన మెచ్యూరిటీ వరకు డిపాజిట్ బోనస్, బీమా మొత్తాన్ని చెల్లిస్తారు. మెచూరిటీ వయస్సు 35, 40, 45, 50, 55, 58, 60 సంవత్సరాల వరకు ఉంటుంది.

బీమాదారు మరణించిన సందర్భంలో, నామినీ లేదా చట్టపరమైన వారసుల‌కు సంపాదించబడిన బోనస్‌తో పాటు మొత్తం హామీ చెల్లించబడుతుంది. ఈ పథకంలో ప్రారంభ పెట్టుబడి రూ. 10,000. గరిష్టంగా రూ.10 లక్షలు పెట్టుబ‌డి పెట్ట‌వ‌చ్చు. మూడేళ్ల తర్వాత ఈ పథకం సరెండర్ చేయబడుతుంది.

మీరు ఐదేళ్ల ముందు పథకాన్ని సరెండర్ చేస్తే, మీకు బోనస్ మొత్తం అందదు. 5 సంవత్సరాల తర్వాత పాలసీని సరెండర్ చేసినట్లయితే, తగ్గించబడిన బీమా మొత్తానికి అనులోమానుపాతంలో బోనస్ చెల్లించబడుతుంది. సంవత్సరానికి సమ్ అస్యూర్డ్ ప్రకారం రూ.1000కి రూ.48 బోనస్ లభిస్తుంది.

పోస్ట్ ఆఫీస్ జీవిత బీమా PLI, RPLI అనే రెండు వర్గాలుగా విభజించబడింది. PLI అనేది పురాతన ప్రభుత్వ బీమా పాలసీ. ఒకవేళ కస్టమర్ ఐదేళ్లు పూర్తి కాకముందే పాలసీకి వ్యతిరేకంగా రుణం తీసుకుంటే, అప్పుడు కూడా ఆ బోనస్ ప్రయోజనం అందుబాటులో ఉండదు. పాలసీలో నామినీని మార్చే సౌకర్యాన్ని అందిస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment