ఇక వాట్సాప్ ద్వారా కూడా కోవిడ్ టీకా స్లాట్‌ను బుక్ చేయ‌వ‌చ్చు.. ఎలాగో తెలుసుకోండి.. స్టెప్ బై స్టెప్ ప‌ద్ధ‌తిలో..!

August 24, 2021 1:28 PM

క‌రోనా నేప‌థ్యంలో టీకాల‌ను వేయించుకునేందుకు గాను ముందుగా స్లాట్‌ల‌ను బుక్ చేసుకోవాల్సి వస్తోంది. అందుకుగాను ఆరోగ్య‌సేతు యాప్‌తోపాటు కోవిన్ పోర్ట‌ల్‌, యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే టీకాల‌ను వేయించుకునేందుకు స్లాట్ బుకింగ్ ప్ర‌క్రియ‌ను కేంద్రం మ‌రింత సుల‌భ‌త‌రం చేసింది. ఇప్పుడు వాట్సాప్‌లో కూడా కోవిడ్ టీకా స్లాట్‌ల‌ను బుక్ చేయ‌వ‌చ్చు. అది ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇక వాట్సాప్ ద్వారా కూడా కోవిడ్ టీకా స్లాట్‌ను బుక్ చేయ‌వ‌చ్చు.. ఎలాగో తెలుసుకోండి.. స్టెప్ బై స్టెప్ ప‌ద్ధ‌తిలో..!

వాట్సాప్ ద్వారా కోవిడ్ టీకా స్లాట్‌ను బుక్ చేయాలంటే ఈ స్టెప్స్‌ను పాటించండి.

1. ముందుగా +919013151515 అనే నంబ‌ర్‌ను మీ ఫోన్ కాంటాక్ట్ లిస్ట్‌లో సేవ్ చేయండి. లేదా https://wa.me/919013151515 అనే సైట్‌ను సంద‌ర్శించండి.

2. వాట్సాప్‌లో Book Slot అని టైప్ చేసి పైన తెలిపిన నంబ‌ర్‌కు పంపించండి.

3. మీ ఫోన్ నంబ‌ర్ కు వ‌చ్చే 6 అంకెల ఓటీపీ నంబ‌ర్‌ను వెరిఫై చేయండి.

4. మీకు సౌక‌ర్య‌వంతంగా ఉండే తేదీ, ప్రాంతం, పిన్ కోడ్ వివ‌రాల‌ను, కావ‌ల్సిన కోవిడ్ వ్యాక్సిన్‌ను ఎంచుకోండి.

5. మీ కోవిడ్ వ్యాక్సినేష‌న్ స్లాట్ క‌న్‌ఫామ్ అవుతుంది.

ఈ విధంగా వాట్సాప్‌లో కోవిడ్ వ్యాక్సిన్ స్లాట్‌ను బుక్ చేయ‌వ‌చ్చు.

ఇక కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న వారు వాట్సాప్ ద్వారా కూడా ఆ స‌ర్టిఫికెట్‌ను పొంద‌వ‌చ్చు. అందుకు ఇలా చేయాలి.

1. ఫోన్ కాంటాక్ట్ లిస్ట్‌లో +919013151515 అనే నంబ‌ర్‌ను సేవ్ చేయాలి.

2. వాట్సాప్ ఓపెన్ చేసి అందులో covid certificate అని టైప్ చేసి పైన తెలిపిన నంబ‌ర్‌కు పంపించాలి.

3. ఓటీపీ ని ఎంట‌ర్ చేయాలి.

4. మీ కోవిడ్ వ్యాక్సినేష‌న్ సర్టిఫికెట్ మొబైల్ స్క్రీన్‌పై క‌నిపిస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment