సంపాదించడం కాదు.. దాచుకోవడం ముఖ్యం: తమన్నా ఫైనాన్షియల్ టిప్స్!

న‌టీన‌టులు డ‌బ్బు బాగా సంపాదించ‌డం ఒకెత్తు అయితే దాన్ని పొదుపు చేయ‌డం మ‌రో ఎత్తు అని, స‌రైన స‌మ‌యంలో డ‌బ్బును పొదుపు చేయ‌క‌పోతే ఎంత సంపాదించినా చివ‌ర‌కు చేతిలో ఏమీ మిగ‌ల‌ద‌ని న‌టి త‌మ‌న్నా భాటియా అన్నారు. సీఎన్‌బీసీ-టీవీ 18కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆమె మాట్లాడారు.

February 25, 2026 1:17 PM
Actress Tamannaah Bhatia talking about financial management and savings.
ఆర్థిక క్రమశిక్షణపై తన అభిప్రాయాలను పంచుకున్న తమన్నా భాటియా. Photo Credit: Tamannaah Bhatia/Instagram.

న‌టీన‌టులు డ‌బ్బు బాగా సంపాదించ‌డం ఒకెత్తు అయితే దాన్ని పొదుపు చేయ‌డం మ‌రో ఎత్తు అని, స‌రైన స‌మ‌యంలో డ‌బ్బును పొదుపు చేయ‌క‌పోతే ఎంత సంపాదించినా చివ‌ర‌కు చేతిలో ఏమీ మిగ‌ల‌ద‌ని న‌టి త‌మ‌న్నా భాటియా అన్నారు. సీఎన్‌బీసీ-టీవీ 18కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆమె మాట్లాడారు. త‌న కెరీర్ ప్రారంభం అయిన కొత్త‌లో చిన్న వ‌య‌స్సు క‌నుక త‌న తండ్రి ఆర్థిక వ్య‌వ‌హారాలు చూసుకునేవార‌ని త‌మ‌న్నా తెలిపారు. అప్ప‌ట్లో త‌న తండ్రి త‌న‌కు ఆర్థికప‌ర‌మైన విష‌యాల్లో ఎంతో స‌హాయం చేశార‌ని అన్నారు. ఇప్ప‌టికీ కొన్ని విష‌యాల్లో త‌న తండ్రి స‌ల‌హాల‌ను పాటిస్తుంటాన‌ని ఆమె తెలిపారు. డ‌బ్బు సంపాద‌న న‌టీన‌టుల‌కు క‌ష్టం కాద‌న్న త‌మ‌న్నా, దాన్ని జాగ్ర‌త్త‌గా కాపాడుకోవ‌డంలోనే అస‌లు విష‌యం ఉంటుంద‌ని తెలిపారు. వివిధ రంగాల్లో పెట్టుబ‌డుల‌తో త‌న పోర్ట్‌ఫోలియో స్ట్రాంగ్‌గా ఉంద‌ని చెప్పుకొచ్చారు.

డ‌బ్బును మేనేజ్ చేయ‌డం తెలియాలి: త‌మ‌న్నా

డ‌బ్బును మేనేజ్ చేయ‌డం గురించి త‌న తండ్రి త‌నకు ఎంతో విలువైన స‌ల‌హాల‌ను ఇస్తార‌ని త‌మన్నా తెలిపారు. ఆయ‌న చెప్పిన విధంగానే తాను భిన్న రంగాల్లో పెట్టుబ‌డులు పెడుతున్నాన‌ని వివ‌రించారు. రియ‌ల్ ఎస్టేట్‌, జ్యువెల్ల‌రీ వంటి రంగాల్లో డ‌బ్బును పొదుపు చేస్తున్న‌ట్లు తెలిపారు. కొంద‌రు న‌టులు త‌మ కెరీర్‌లో డ‌బ్బును బాగానే సంపాదిస్తార‌ని, కానీ నిల‌బెట్టుకోలేక‌పోతార‌ని త‌మ‌న్నా అన్నారు. డ‌బ్బును మేనేజ్ చేయ‌డం తెలియ‌కపోతే ఎంత సంపాదించినా చేతిలో నిల‌వ‌ద‌ని, చివ‌ర‌కు ఏమీ మిగ‌ల‌కుండానే క‌ష్టాలు అనుభ‌విస్తార‌ని త‌మ‌న్నా అన్నారు. ఆమె చెప్పిన‌ట్లే ఇండ‌స్ట్రీలో కొంద‌రు న‌టీన‌టులు ఇప్ప‌టికే అలాంటి క‌ష్టాల‌ను అనుభ‌వించారు. బాలీవుడ్‌లో బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్ కూడా ఓ ద‌శ‌లో చేతిలో చిల్లిగ‌వ్వ లేని స్థితికి చేరుకుని ఇప్పుడు అనేక విధాలుగా సంపాదిస్తున్నారు. అందువ‌ల్లే డ‌బ్బును మేనేజ్ చేయ‌డం ముఖ్య‌మ‌ని త‌మ‌న్నా అన్నారు.

ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే త‌మ‌న్నా ప్ర‌స్తుతం లీడ్ రోల్ క‌న్నా గెస్ట్ పాత్ర‌ల్లో, ఐట‌మ్ సాంగ్‌ల‌లోనే ఎక్కువ‌గా న‌టిస్తున్నారు. ఆమె ప్ర‌ధాన పాత్ర‌లో చివ‌రిసారిగా తెలుగులో ఓదెల 2 అనే చిత్రంలో న‌టించారు. అలాగే హిందీలో రైడ్ 2 అనే మూవీలో ఓ ప్ర‌త్యేక పాట‌లో ద‌ర్శ‌న‌మిచ్చారు. ఈ రెండు సినిమాలు 2025లో రిలీజ్ అయ్యాయి. ప్ర‌స్తుతానికి ఆమె ఖాతాలో సినిమాలు ఏమీ లేవు. కానీ ఐట‌మ్ సాంగ్‌ల‌కు ఆఫ‌ర్లు వ‌స్తే మాత్రం కాద‌నుకుండా చేస్తోంది.

గమనిక/Disclaimer: ఈ కథనం కేవలం సమాచారం కోసం మాత్రమే. ఆర్థికపరమైన పెట్టుబడులు పెట్టే ముందు నిపుణుల సలహాలు తీసుకోవడం శ్రేయస్కరం.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment