పోస్టాఫీసులో సురక్షితమైన మార్గాల్లో మీ డబ్బును పెట్టుబడి పెట్టి అంతే మొత్తంలో రెట్టింపు ఆదాయాన్ని పొందాలని చూస్తున్నారా ? అయితే పోస్టాఫీస్‌లో లభిస్తున్న ఈ పథకం కోసమే. పోస్టాఫీస్ కిసాన్ వికాస్ పత్ర ద్వారా మీ డబ్బు సురక్షితంగా ఉంటుంది. అందులో పెట్టుబడి పెడితే 124 నెలల్లో మీరు రెట్టింపు మొత్తంలో ఆదాయాన్ని పొందవచ్చు. 10 ఏళ్ల 4 నెలల కాలం పాటు అందులో డబ్బును ఉంచితే అది రెట్టింపు అవుతుంది.
పోస్టాఫీస్ అందిస్తున్న కిసాన్ వికాస్ పత్ర స్కీమ్ ద్వారా మీరు పెట్టే డబ్బుకు ఏడాదికి 6.9 శాతం వడ్డీ చెల్లిస్తారు. పెద్దలు, పిల్లలు ఎవరైనా సరే ఇందులో డబ్బును పొదుపు చేసుకోవచ్చు. చిన్నారులకు అయితే సంరక్షకులు లేదా తల్లిదండ్రుల ఆధ్వర్యంలో పథకాన్ని అందిస్తారు. ఈ పథకంలో ముగ్గురు కలిసి జాయింట్ అకౌంట్‌గా ఏర్పడి డబ్బును పెట్టుబడి పెట్టవచ్చు. ఇక ఈ స్కీమ్ కింద ఎన్ని అకౌంట్లను అయినా ఓపెన్ చేయవచ్చు.
ఈ స్కీమ్‌లో భాగంగా కనీసం రూ.1000 పొదుపు చేయాలి. గరిష్టంగా ఎంతైనా డిపాజిట్ చేయవచ్చు. కిసాన్ వికాస్ పత్ర స్కీమ్‌ను మెచూరిటీ తీరకముందే క్లోజ్ చేయవచ్చు. అయితే అందుకు కొన్ని నిబంధనలు ఉంటాయి. జాయింట్ అకౌంట్ లేదా సింగిల్ అకౌంట్ హోల్డర్లు చనిపోయినా ఈ స్కీమ్ కింద అకౌంట్‌ను ముందుగానే క్లోజ్ చేయవచ్చు. అందుకు కూడా కొన్ని నియమాలు ఉంటాయి.
ఇక కిసాన్ వికాస్ పత్ర అకౌంట్‌ను ప్రారంభించిన 2 ఏళ్ల 6 నెలల అనంతరం అకౌంట్‌ను ముందుగా క్లోజ్ చేయవచ్చు. ఈ స్కీమ్‌లో అకౌంట్‌ను ఒక వ్యక్తి ఇంకో వ్యక్తికి ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు. దానికి కూడా కొన్ని నిబంధనలు ఉంటాయి. కిసాన్ వికాస్ పత్ర అకౌంట్ హోల్డర్ చనిపోతే నామినీ పేరిట అకౌంట్‌ను ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. సింగిల్, జాయింట్ హోల్డర్లకు కూడా ఇది వర్తిస్తుంది. దానికి పోస్టాఫీస్ వారు సూచించే విధంగా ఫార్మాలిటీస్‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…