పోస్టాఫీస్ అందిస్తున్న స్కీమ్ ఇది.. ఇందులో పొదుపు చేస్తే మీ డ‌బ్బు రెట్టింపు అవుతుంది..!

April 12, 2021 11:59 AM

పోస్టాఫీసులో సుర‌క్షిత‌మైన మార్గాల్లో మీ డ‌బ్బును పెట్టుబ‌డి పెట్టి అంతే మొత్తంలో రెట్టింపు ఆదాయాన్ని పొందాల‌ని చూస్తున్నారా ? అయితే పోస్టాఫీస్‌లో ల‌భిస్తున్న ఈ ప‌థ‌కం కోస‌మే. పోస్టాఫీస్ కిసాన్ వికాస్ ప‌త్ర ద్వారా మీ డ‌బ్బు సుర‌క్షితంగా ఉంటుంది. అందులో పెట్టుబ‌డి పెడితే 124 నెల‌ల్లో మీరు రెట్టింపు మొత్తంలో ఆదాయాన్ని పొంద‌వ‌చ్చు. 10 ఏళ్ల 4 నెల‌ల కాలం పాటు అందులో డ‌బ్బును ఉంచితే అది రెట్టింపు అవుతుంది.

invest in this post office scheme you will get double amount

పోస్టాఫీస్ అందిస్తున్న కిసాన్ వికాస్ ప‌త్ర స్కీమ్ ద్వారా మీరు పెట్టే డ‌బ్బుకు ఏడాదికి 6.9 శాతం వ‌డ్డీ చెల్లిస్తారు. పెద్ద‌లు, పిల్ల‌లు ఎవ‌రైనా స‌రే ఇందులో డ‌బ్బును పొదుపు చేసుకోవ‌చ్చు. చిన్నారుల‌కు అయితే సంర‌క్ష‌కులు లేదా త‌ల్లిదండ్రుల ఆధ్వ‌ర్యంలో ప‌థ‌కాన్ని అందిస్తారు. ఈ ప‌థ‌కంలో ముగ్గురు క‌లిసి జాయింట్ అకౌంట్‌గా ఏర్ప‌డి డ‌బ్బును పెట్టుబ‌డి పెట్ట‌వ‌చ్చు. ఇక ఈ స్కీమ్ కింద ఎన్ని అకౌంట్ల‌ను అయినా ఓపెన్ చేయ‌వ‌చ్చు.

ఈ స్కీమ్‌లో భాగంగా క‌నీసం రూ.1000 పొదుపు చేయాలి. గ‌రిష్టంగా ఎంతైనా డిపాజిట్ చేయ‌వచ్చు. కిసాన్ వికాస్ ప‌త్ర స్కీమ్‌ను మెచూరిటీ తీర‌క‌ముందే క్లోజ్ చేయ‌వ‌చ్చు. అయితే అందుకు కొన్ని నిబంధ‌న‌లు ఉంటాయి. జాయింట్ అకౌంట్ లేదా సింగిల్ అకౌంట్ హోల్డ‌ర్లు చ‌నిపోయినా ఈ స్కీమ్ కింద అకౌంట్‌ను ముందుగానే క్లోజ్ చేయ‌వ‌చ్చు. అందుకు కూడా కొన్ని నియ‌మాలు ఉంటాయి.

ఇక కిసాన్ వికాస్ ప‌త్ర అకౌంట్‌ను ప్రారంభించిన 2 ఏళ్ల 6 నెల‌ల అనంత‌రం అకౌంట్‌ను ముందుగా క్లోజ్ చేయ‌వ‌చ్చు. ఈ స్కీమ్‌లో అకౌంట్‌ను ఒక వ్య‌క్తి ఇంకో వ్య‌క్తికి ట్రాన్స్‌ఫ‌ర్ చేయ‌వ‌చ్చు. దానికి కూడా కొన్ని నిబంధ‌న‌లు ఉంటాయి. కిసాన్ వికాస్ ప‌త్ర అకౌంట్ హోల్డ‌ర్ చ‌నిపోతే నామినీ పేరిట అకౌంట్‌ను ట్రాన్స్‌ఫ‌ర్ చేసుకోవ‌చ్చు. సింగిల్‌, జాయింట్ హోల్డ‌ర్ల‌కు కూడా ఇది వ‌ర్తిస్తుంది. దానికి పోస్టాఫీస్ వారు సూచించే విధంగా ఫార్మాలిటీస్‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment