స‌మాచారం

పోస్టాఫీసులో అందుబాటులో ఉన్న స్కీమ్‌లు ఇవి.. వీటిల్లో పొదుపు చేస్తే డ‌బ్బు రెట్టింపు అవుతుంది..!

దేశ‌వ్యాప్తంగా ఉన్న పోస్టాఫీసుల్లో పౌరుల‌కు అనేక ర‌కాల స్కీమ్‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఎందులో ఎక్కువ మొత్తంలో ఆదాయం పొంద‌వ‌చ్చు అనే విష‌యం చాలా మందికి తెలియ‌దు. నిజానికి పోస్టాఫీసులు అందిస్తున్న అనేక స్కీమ్‌ల‌లో డ‌బ్బుల‌ను పొదుపు చేస్తే కొన్ని ఏళ్ల‌కు రెట్టింపు మొత్తంలో డ‌బ్బును పొంద‌వ‌చ్చు. మ‌రి ఆ స్కీమ్‌లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

1. పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్

ఇందులో 1-3 ఏళ్ల పాటు డ‌బ్బును పొదుపు చేయ‌వ‌చ్చు. ఏడాదికి 5.5 శాతం వ‌డ్డీ చెల్లిస్తారు. ఇందులో డ‌బ్బును పొదుపు చేస్తే 13 ఏళ్ల‌కు రెట్టింపు మొత్తంలో డ‌బ్బు పొంద‌వ‌చ్చు. ఇందులో 5 ఏళ్ల పాటు కూడా పొదుపు చేయ‌వ‌చ్చు. దీంతో 6.7 శాతం వ‌డ్డీ చెల్లిస్తారు. ఇక 5 ఏళ్ల డిపాజిట్ స్కీమ్ తీసుకుంటే 10 ఏళ్ల 9 నెల‌ల‌కు రెట్టింపు మొత్తంలో డ‌బ్బును పొంద‌వ‌చ్చు.

2. పోస్టాఫీస్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్

పోస్టాఫీస్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్‌లో డ‌బ్బును పొదుపు చేస్తే 18 ఏళ్ల‌కు రెట్టింపు మొత్తం ల‌భిస్తుంది. ఏడాదికి 4 శాతం వ‌డ్డీ చెల్లిస్తారు.

3. పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్స్

రిక‌రింగ్ డిపాజిట్స్ (ఆర్‌డీ) స్కీమ్‌లో పెట్టే డ‌బ్బుల‌కు ఏడాదికి 5.8 శాతం వ‌డ్డీ చెల్లిస్తారు. ఇందులో 12 ఏళ్ల 5 నెల‌ల పాటు డ‌బ్బును పొదుపు చేస్తే రెట్టింపు మొత్తంలో లాభం పొందవ‌చ్చు.

4. పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌క‌మ్ స్కీమ్

ఇందులో 6.6 శాడం వ‌డ్డీని ఏడాదికి చెల్లిస్తారు. 10.91 ఏళ్ల‌లో పెట్టిన మొత్తం రెట్టింపు అవుతుంది.

5. పోస్టాఫీస్ సీనియ‌ర్ సిటిజెన్ సేవింగ్ స్కీమ్

వృద్ధుల‌కు పోస్టాఫీస్ అందిస్తున్న సేవింగ్స్ స్కీమ్ ఇది. ఇందులో వారికి ఏడాదికి 7.4 శాతం వ‌డ్డీని చెల్లిస్తారు. 9.73 ఏళ్ల‌లో పెట్టిన మొత్తం రెట్టింపు అవుతుంది.

6. పోస్టాఫీస్ పీపీఎఫ్

పోస్టాఫీస్ ప‌బ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్‌) ప‌థ‌కంలో ఏడాదికి 7.1 శాతం వ‌డ్డీ చెల్లిస్తారు. 15 ఏళ్ల పాటు పొదుపు చేయాలి. 10.14 ఏళ్ల‌లో డ‌బ్బు రెట్టింపు అవుతుంది.

7. పోస్టాఫీస్ సుక‌న్య స‌మృద్ధి అకౌంట్

ఆడ‌పిల్ల‌ల కోసం అంద‌జేస్తున్న ప‌థ‌కం ఇది. ఇందులో ఏడాదికి 7.6 శాతం వ‌డ్డీని చెల్లిస్తారు. 9 ఏళ్ల 6 నెల‌ల‌కు డ‌బ్బులు రెట్టింపు అవుతాయి.

8. పోస్టాఫీస్ నేష‌న‌ల్ సేవింగ్ స‌ర్టిఫికెట్

దీంట్లో ఏడాదికి 6.8 శాతం వ‌డ్డీని పొంద‌వ‌చ్చు. 5 ఏళ్ల పాటు పెట్టుబ‌డి పెట్ట‌వ‌చ్చు. ట్యాక్స్ బెనిఫిట్స్ వ‌ర్తిస్తాయి. 10 ఏళ్ల 7 నెల‌ల‌కు డ‌బ్బులు రెట్టింపు అవుతాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM