మీరు ఉద్యోగస్తులా..? మీకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ ఉందా..? ప్రతి నెల మీకు ఈపీఎఫ్ అకౌంట్లో డబ్బులు జమ చేస్తున్నారా ? అయితే ముఖ్యంగా మీరు ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్స్యూరెన్స్-EDLI స్కీమ్ గురించి తెలుసుకోవాల్సిందే. ఈ స్కీమ్ ద్వారా ఉద్యోగుల కుటుంబానికి సుమారుగా రూ.7 లక్షల వరకు లబ్ధి చేకూరుతుందని చెప్పవచ్చు. EDLI స్కీమ్ అనేది ఒక ఇన్సూరెన్స్ స్కీమ్. ఈపీఎఫ్ అకౌంట్ ఉన్న ఉద్యోగులందరూ ఈ స్కీమ్ కిందకు వస్తారు.
ఈ స్కీం ద్వారా ఉద్యోగులకు ఏడు లక్షల రూపాయల వరకు బీమా వర్తిస్తుంది. ఈ క్రమంలోనే ఉద్యోగులు ఈపీఎఫ్ అకౌంట్ కొనసాగిస్తూనే ప్రమాదవశాత్తూ మరణిస్తే వారి కుటుంబానికి 7 లక్షల రూపాయల బీమా లభిస్తుంది. అయితే ఈ స్కీం ద్వారా ఏడు లక్షల రూపాయలను లబ్ధి పొందాలంటే తప్పనిసరిగా ఇ-నామినేషన్ ఫైల్ చేయాల్సి ఉంటుంది.
ఈ స్కీమ్ పొంది ఉద్యోగి ప్రమాదవశాత్తూ మరణిస్తే అతనికి వచ్చే బీమా అతని నామినీగా ఎవరైతే ఉంటారో వారికి ఆ డబ్బులు చెందడం కోసం ఇ – నామినేషన్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా నామినీ ఫైల్ చేయాలనుకునేవారు ఈపీఎఫ్ఓ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లోనే నామినీ వివరాలు ఎంటర్ చేయొచ్చు. ఈపీఎఫ్ఓ ఇ-నామినేషన్ ద్వారా ఇది సాధ్యం. ఇలా చేయటం వల్ల వారు మరణించిన తరువాత వారి కుటుంబాలకు సామాజిక భద్రత అందించాలని ఈపీఎఫ్ఓ కూడా కోరుతోంది. ఈ క్రమంలోనే ఈపీఎఫ్ లేదా నామినేషన్ డిజిటల్ పద్ధతిలో పూర్తి చేయాలని కోరుతోంది. ఇక ఈపీఎఫ్ అకౌంట్‌లో ఇ-నామినేషన్ ఎలా ఫైల్ చేయాలో తెలుసుకోవాలంటే ఈ కింది వీడియోని చూడండి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…