ఈపీఎఫ్ ఉన్నవారు అలర్ట్.. ఈ ఒక్క ఫామ్ నింపితే చాలు రూ.7 లక్షలు బెనిఫిట్..!

August 23, 2021 9:00 PM

మీరు ఉద్యోగస్తులా..? మీకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ ఉందా..? ప్రతి నెల మీకు ఈపీఎఫ్ అకౌంట్లో డబ్బులు జమ చేస్తున్నారా ? అయితే ముఖ్యంగా మీరు ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్స్యూరెన్స్-EDLI స్కీమ్ గురించి తెలుసుకోవాల్సిందే. ఈ స్కీమ్ ద్వారా ఉద్యోగుల కుటుంబానికి సుమారుగా రూ.7 లక్షల వరకు లబ్ధి చేకూరుతుందని చెప్పవచ్చు. EDLI స్కీమ్ అనేది ఒక ఇన్సూరెన్స్ స్కీమ్.  ఈపీఎఫ్ అకౌంట్ ఉన్న ఉద్యోగులందరూ ఈ స్కీమ్ కిందకు వస్తారు.

ఈ స్కీం ద్వారా ఉద్యోగులకు ఏడు లక్షల రూపాయల వరకు బీమా వర్తిస్తుంది. ఈ క్రమంలోనే ఉద్యోగులు ఈపీఎఫ్ అకౌంట్ కొనసాగిస్తూనే ప్రమాదవశాత్తూ మరణిస్తే వారి కుటుంబానికి 7 లక్షల రూపాయల బీమా లభిస్తుంది. అయితే ఈ స్కీం ద్వారా ఏడు లక్షల రూపాయలను లబ్ధి పొందాలంటే తప్పనిసరిగా  ఇ-నామినేషన్ ఫైల్ చేయాల్సి ఉంటుంది.

ఈ స్కీమ్ పొంది ఉద్యోగి ప్రమాదవశాత్తూ మరణిస్తే అతనికి వచ్చే బీమా అతని నామినీగా ఎవరైతే ఉంటారో వారికి ఆ డబ్బులు చెందడం కోసం ఇ – నామినేషన్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా నామినీ ఫైల్ చేయాలనుకునేవారు ఈపీఎఫ్ఓ పోర్టల్‌ ద్వారా ఆన్‌లైన్‌లోనే నామినీ వివరాలు ఎంటర్ చేయొచ్చు. ఈపీఎఫ్ఓ ఇ-నామినేషన్ ద్వారా ఇది సాధ్యం. ఇలా చేయటం వల్ల వారు మరణించిన తరువాత వారి కుటుంబాలకు సామాజిక భద్రత అందించాలని ఈపీఎఫ్ఓ కూడా కోరుతోంది. ఈ క్రమంలోనే ఈపీఎఫ్ లేదా నామినేషన్ డిజిటల్ పద్ధతిలో పూర్తి చేయాలని కోరుతోంది. ఇక ఈపీఎఫ్ అకౌంట్‌లో ఇ-నామినేషన్ ఎలా ఫైల్ చేయాలో తెలుసుకోవాలంటే ఈ కింది వీడియోని చూడండి.

https://twitter.com/socialepfo/status/1427593550586212358

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now