డబ్బులు లేకపోయినా సిలిండర్ బుక్ చేసుకోవచ్చు.. ఎలాగంటే ?

August 13, 2021 10:45 PM

మీరు గ్యాస్ సిలిండర్ వినియోగిస్తున్నారా? అయితే గ్యాస్ బుక్ చేయాలా? గ్యాస్ బుక్ చేయాలి అంటే మీ దగ్గర డబ్బులు లేవని ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇకపై ఇబ్బంది పడేపని లేదని చెప్పవచ్చు. మీ దగ్గర డబ్బులు లేకపోయినా గ్యాస్ బుక్ చేసుకునే సదుపాయాన్ని పేటీఎం తన కస్టమర్లకు అందిస్తోంది.పేటియం ద్వారా ఉచితంగా గ్యాస్ సిలిండర్ ను ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనే విషయానికి వస్తే..

పేటీఎం తన కస్టమర్ల కోసం పోస్ట్ పెయిడ్ సర్వీసులను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో భాగంగా మీ దగ్గరడబ్బులు లేకపోయినా గ్యాస్ బుక్ చేసుకుని ఆ తరువాత నెల రోజుల వ్యవధిలోగా డబ్బులను తిరిగి చెల్లించే అవకాశాన్ని పేటీఎం తన కస్టమర్లకు కల్పించింది. ఈ విధమైన అవకాశం ద్వారా చాలామంది కస్టమర్లకు ఊరట కలుగుతుందని చెప్పవచ్చు.

అదేవిధంగా ఎల్పీజీ కస్టమర్ల కోసం మరొక ఆఫర్ ని కూడా పేటియం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ క్రమంలోనే కస్టమర్ల కోసం అదిరిపోయే క్యాష్ బ్యాక్ ఆఫర్ ని కల్పిస్తోంది. పేటీఎమ్ ద్వారా గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తే క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇది కనిష్టంగా పది రూపాయల నుంచి గరిష్టంగా తొమ్మిది వందల వరకు క్యాష్ బ్యాక్ పొందే అవకాశాన్ని పేటీఎం తన కస్టమర్లకు కల్పించింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment