ఆగస్టు ఒకటి తర్వాత అమలులోకి రానున్న.. రూల్స్ ఇవే!

July 24, 2021 7:27 PM

మరి కొద్ది రోజులు గడవడంతో జూలై నెల పూర్తయి ఆగస్టు నెలలోకి అడుగు పెడతాము. ఆగస్టు నెల వచ్చీరావడంతోనే ఎన్నో కొత్త నిబంధనలను అమలులోకి తీసుకు వస్తోంది. ఈ కొత్త రూల్స్ వల్ల సాధారణ ప్రజల పై కొంతమేర ప్రభావం చూపించనుంది. మరి ఆగస్టు 1వ తేదీ నుంచి ఎలాంటి నిబంధనలు అమలులోకి వస్తాయనే విషయం ఇక్కడ తెలుసుకుందాం.

ప్రైవేటు రంగానికి చెందిన దిగ్గజ బ్యాంకులలో ఒకటైన ఐసీఐసీఐ బ్యాంక్ ఆగస్టు 1వ తేదీ నుంచి సరికొత్త రూల్స్ అమలులోకి రానున్నాయి. చెక్ బుక్, ఏటీఎం క్యాష్ విత్ డ్రా వంటి రూల్స్ ను సవరించింది.ఈ క్రమంలోనే కస్టమర్లు పరిమితికి మించి డబ్బులు ఏటీఎం నుంచి విత్ డ్రా చేయడం వల్ల వారిపై అదనపు చార్జీలు పడనున్నాయి.

ఇక ప్రతి నెల 1వ తేదీ ఎల్పిజి గ్యాస్ సిలిండర్ల ధరలలో మార్పులు చోటు చేసుకుంటాయి. గ్యాస్ ధరలు పెరగవచ్చు లేదా తగ్గవచ్చు. కొన్నిసార్లు స్థిరంగానే ఉండవచ్చు.మరి ఈ నెలలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి తెలియాల్సి ఉంది.

ప్రపంచ రిజర్వ్ బ్యాంక్ ఉద్యోగులకు, పెన్షనర్లకు శుభవార్తను తెలిపింది. ఆగస్టు 1వ తేదీ నుంచి సెలవు రోజులలో కూడా పెన్షన్ డబ్బులు, జీతం వారి అకౌంట్ లో జమ కానుంది. ఇప్పటివరకు సెలవు రోజులలో పెన్షన్, జీతాలు, ఈఎంఐ చెల్లింపులకు అవకాశం ఉండేది కాదు. RBI నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్ నిబంధనలలో మార్పులు చేయటం వల్ల సెలవు రోజుల్లో కూడా జీతాలు పెన్షన్లు అకౌంట్లలో జమ కానున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment