కంప్యూట‌ర్ల‌లో ఉండే SSD ల‌కు HDD ల‌కు తేడా ఏమిటో తెలుసా ? ఏవి ఎక్కువ వేగంగా ప‌నిచేస్తాయంటే ?

August 20, 2021 8:08 PM

ఒక‌ప్పుడు కంప్యూట‌ర్ల‌లో హార్డ్ డిస్క్ డ్రైవ్‌లు చాలా త‌క్కువ కెపాసిటీతో ఉండేవి. అంతేకాదు, చాలా నెమ్మ‌దిగా ప‌నిచేసేవి. కానీ టెక్నాల‌జీ మారింది. దీంతో వేగంగా ప‌నిచేసే హార్డ్ డిస్క్ డ్రైవ్ (HDD)లు వ‌చ్చాయి. అయితే ప్ర‌స్తుతం మార్కెట్‌లో ల‌భిస్తున్న కంప్యూట‌ర్ల‌లో SSD లు కూడా అందుబాటులో ఉంటున్నాయి. ఇంత‌కీ అస‌లు SSD అంటే ఏమిటి ? దీనికి HDDల‌కు ఉన్న సంబంధం ఏమిటి ? రెండింటిలో ఏవి వేగంగా పనిచేస్తాయి ? వేటిని ఏయే అవ‌స‌రాల‌కు వాడుతారు ? అన్న విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

కంప్యూట‌ర్ల‌లో ఉండే SSD ల‌కు HDD ల‌కు తేడా ఏమిటో తెలుసా ? ఏవి ఎక్కువ వేగంగా ఉంటాయంటే..?
కంప్యూట‌ర్‌లో ఉండే HDD ఈ విధంగా ఉంటుంది

HDD అంటే Hard disk drive అని అర్థం వ‌స్తుంది. SSD అంటే Solid-state drive అని అర్థం. HDD ల‌లో డేటాను ఫిజిక‌ల్‌గా స్టోర్ చేస్తారు. వాటిలో చిన్న‌పాటి డ్రైవ్‌లు ఉంటాయి. వాటిలో డేటా స్టోర్ అవుతుంది. ఇక SSD ల‌లో చిప్స్ ఉంటాయి. వాటిలో డేటా స్టోర్ అవుతుంది. వేగం విష‌యానికి వ‌స్తే డేటా చిప్స్ లో స్టోర్ అవుతుంది క‌నుక SSD లు వేగంగా ప‌నిచేస్తాయి. వీటి క‌న్నా HDD లు కొద్దిగా నెమ్మ‌దిగా ప‌నిచేస్తాయి.

అయితే HDD ల‌ను ఎంత కాలం పాటు అయినా ఉప‌యోగించుకోవ‌చ్చు. వాటిల్లో ఎర్ర‌ర్స్ త‌క్కువ‌గా వ‌స్తాయి. ఒక వేళ డేటా పోయినా రిక‌వ‌రీ చేసేందుకు అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. కానీ SSD లు అలా కాదు. అవి కొంత కాలం ప‌నిచేశాక పాడైతే వాటిల్లో ఉండే డేటాను రిక‌వ‌రీ చేయ‌లేం. అందుక‌నే సాధార‌ణంగా కంప్యూట‌ర్ల‌లో HDD ల‌ను డేటాను స్టోర్ చేసేందుకు వాడుతుంటారు. ఇక SSD ల‌ను ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌ల‌ను హోస్ట్ చేసేందుకు వాడుతారు. వాటిల్లో సాఫ్ట్‌వేర్‌ల‌ను ఇన్‌స్టాల్ చేస్తారు. దీంతో కంప్యూట‌ర్లు వేగంగా పనిచేస్తాయి.

కంప్యూట‌ర్ల‌లో ఉండే SSD ల‌కు HDD ల‌కు తేడా ఏమిటో తెలుసా ? ఏవి ఎక్కువ వేగంగా ప‌నిచేస్తాయంటే ?
కంప్యూట‌ర్ల‌లో ఉండే SSD ఈ విధంగా ఉంటుంది

అయితే ప్ర‌స్తుతం మ‌న‌కు అందుబాటులో ఉన్న అనేక ర‌కాల కంప్యూట‌ర్ల‌లో SSD, HDD ల‌ను రెండింటినీ క‌లిపి ఇస్తున్నారు. SSD లేకుండా కేవ‌లం HDD ల‌తోనూ కంప్యూట‌ర్లు మ‌న‌కు అందుబాటులో ఉంటున్నాయి. అయితే ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌, సాఫ్ట్‌వేర్ల‌తో వేగంగా ప‌నిచేయాలంటే కంప్యూట‌ర్ల‌లో క‌చ్చితంగా SSD ఉండాలి. SSD వాడ‌కం వ‌ల్ల కంప్యూట‌ర్‌లో వేగంగా ప‌నిచేసుకోవ‌చ్చు. ప్ర‌స్తుతం మ‌న‌కు SSD లు 128జీబీ మొద‌లు కొని ల‌భిస్తున్నాయి. చాలా వ‌ర‌కు కంప్యూట‌ర్ల‌లో SSD ల‌ను డిఫాల్ట్‌గా 128 జీబీ స్టోరేజ్‌తో ఇస్తున్నారు. అవ‌స‌రం అయితే 256జీబీ, 512జీబీ, 1టీబీ వ‌రకు కెపాసిటీ ఉన్న SSD ల‌తో కంప్యూట‌ర్ల‌ను తీసుకోవ‌చ్చు. దీంతో ఎక్కువ సాఫ్ట్ వేర్ల‌ను ఇన్‌స్టాల్ చేసి వాడుకునేందుకు వీలు క‌లుగుతుంది.

ఇక HDD లు అయితే 1టీబీ, 2టీబీ, 4టీబీ ఉన్న‌వి మ‌న‌కు ల‌భిస్తున్నాయి. వీటిలో డేటాను ఎక్కువ స్టోర్ చేస్తారు క‌నుక డేటాను ఎక్కువ స్టోర్ చేయాల్సి వ‌స్తుంద‌నుకుంటే ఎక్కువ కెపాసిటీ ఉన్న HDD ల‌ను తీసుకుని కంప్యూట‌ర్ల‌లో వాడాల్సి ఉంటుంది. ఈ విధంగా కంప్యూట‌ర్లలో SSD, HDD లు ప‌నిచేస్తాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment