వొడాఫోన్ ఐడియా క‌స్ట‌మ‌ర్ల‌కు హెచ్చ‌రిక‌.. క‌చ్చితంగా తెలుసుకోవాల్సిన విష‌యం..

July 31, 2021 6:46 PM

టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియా త‌న కస్ట‌మ‌ర్ల‌కు తాజాగా హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. కేవైసీ మోసాలు దేశంలో పెరుగుతున్న దృష్ట్యా త‌మ కస్ట‌మ‌ర్లు అల‌ర్ట్‌గా ఉండాల‌ని సూచించింది. త‌మ క‌స్ట‌మ‌ర్ల‌కు కేవైసీ వివ‌రాల‌ను అప్‌డేట్ చేస్తామంటూ ఎస్ఎంఎస్‌లు, కాల్స్ ఎక్కువ‌గా వ‌స్తున్నాయ‌ని, అందువ‌ల్ల ఈ విష‌యంలో క‌స్ట‌మ‌ర్లు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచించింది.

vodafone idea alerts its customers about kyc frauds

కేవైసీ వివ‌రాల‌ను అప్‌డేట్ చేస్తామంటూ క‌స్ట‌మ‌ర్ల‌కు కొంద‌రు ఎస్ఎంఎస్‌లు పంపుతున్నార‌ని, కాల్స్ చేస్తున్నార‌ని ఆ కంపెనీ తెలిపింది. అయితే వాటిని న‌మ్మ‌కూడ‌ద‌ని, తాము ఎప్పుడూ అలా అడ‌గ‌మ‌ని తెలిపింది. ఎవ‌రైనా కేవైసీ అప్‌డేట్ చేస్తామ‌ని వివ‌రాల‌ను అడిగితే చెప్ప‌కూడ‌ద‌ని, ముఖ్యంగా ఓటీపీల‌ను అస్స‌లు చెప్ప‌కూడ‌ద‌ని సూచించింది. లేదంటే సిమ్ ఫ్రాడ్ జ‌రుగుతుంద‌ని, దీంతో డ‌బ్బులు న‌ష్ట‌పోయేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని వొడాఫోన్ ఐడియా హెచ్చ‌రిక‌లు జారీ చేసింది.

ఇటీవ‌లి కాలంలో ఎస్‌బీఐ వంటి బ్యాంకుల‌తోపాటు పేటీఎం క‌స్ట‌మ‌ర్ల‌కు కూడా ఇలాగే కాల్స్, ఎస్ఎంఎస్‌లు వ‌స్తున్నాయి. అయితే కేవైసీ అప్‌డేట్ చేస్తామ‌ని ఎవ‌రైనా చెబితే అస్స‌లు న‌మ్మ‌కూడ‌దు. కంపెనీలు నిజానికి కాల్ చేసి స‌మాచారం అడ‌గ‌వు. క‌నుక ఇలా చేసే వారి ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment