
భారత్‌లో అత్యధిక బ్యాటరీ సామర్థ్యంతో కూడిన స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేస్తామని హామీ ఇచ్చినట్లే realme తన పి సిరీస్‌లో తాజా మోడల్ realme P4 Power 5Gని అధికారికంగా ఆవిష్కరించింది. 10,001mAh భారీ బ్యాటరీతో ఇది దేశంలోనే అతిపెద్ద బ్యాటరీ కలిగిన స్మార్ట్‌ఫోన్‌గా నిలిచింది. ఈ ఫోన్‌లో 6.8 అంగుళాల FHD+ (1.5K) HyperGlow 4D Curve+ AMOLED డిస్‌ప్లే ఉంది. 144Hz రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్ట్‌తో పాటు గరిష్టంగా 6500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ అందిస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ కూడా ఉంది. పనితీరు పరంగా, 4nm టెక్నాలజీపై ఆధారపడిన MediaTek Dimensity 7400 Ultra 5G ప్రాసెసర్‌తో పాటు ప్రత్యేక HyperVision+ AI చిప్‌ను అందించారు. ఇది BGMI గేమింగ్‌లో 90fps అనుభవాన్ని, అలాగే 16% తక్కువ విద్యుత్ వినియోగాన్ని అందిస్తుందని కంపెనీ చెబుతోంది.
అద్భుతమైన కెమెరా ఫీచర్లు..
8GB / 12GB LPDDR4X RAMకు తోడు 14GB వరకు వర్చువల్ RAM సపోర్ట్ ఉంది. 4K వీడియో రికార్డింగ్, దీర్ఘకాల గేమింగ్ సమయంలో పనితీరు తగ్గకుండా ఉండేందుకు 7000mm² AirFlow VC కూలింగ్ సిస్టమ్‌ను అందించారు. realme P4 Power 5Gలో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. 50MP ప్రైమరీ కెమెరా (IMX882 సెన్సార్, OIS), 8MP అల్ట్రా వైడ్ కెమెరాలను ఇచ్చారు. సెల్ఫీల కోసం ముందు భాగంలో 16MP Sony IMX480 కెమెరా ఉంది. 4K వీడియో రికార్డింగ్‌కు మద్దతుతో పాటు AI ల్యాండ్‌స్కేప్ వంటి AI ఆధారిత ఫోటోగ్రఫీ ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్ Android 16 ఆధారిత realme UI 7.0తో వస్తుంది. 3 Android OS అప్డేట్స్, 4 సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్స్‌ను realme హామీ ఇచ్చింది.
భారీ బ్యాటరీ..
TransView Design కాన్సెప్ట్‌తో ఈ ఫోన్‌ను రూపొందించారు. టెక్నాలజీని దాచకుండా, లోపలి భాగాల అందాన్ని చూపించే విధంగా డిజైన్ చేయడం దీని ప్రత్యేకత. Trans Orange, Trans Silver, Trans Blue రంగుల్లో అందుబాటులో ఉంటుంది. Gen Z యువతను లక్ష్యంగా చేసుకుని, వ్యక్తిత్వానికి పొడిగింపుగా ఈ డిజైన్ రూపొందించబడిందని కంపెనీ పేర్కొంది. ఈ ఫోన్‌లో భారత్‌లోనే తొలిసారి 10,001mAh Titan Battery ని అందించారు. Next-Gen Silicon-Carbon Anode Tech (30% ఎక్కువ బ్యాటరీ లైఫ్), Dual-Layer Coating Process, C-Pack Protection Board Design లను ఇచ్చారు. 80W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్‌తో కేవలం 5 నిమిషాల ఛార్జింగ్‌లో సగం రోజు బ్యాటరీ బ్యాకప్ లభిస్తుందని realme చెబుతోంది. అదనంగా 55W PPS ఛార్జింగ్, 27W రివర్స్ ఛార్జింగ్, బైపాస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది.
మిలిటరీ గ్రేడ్ నాణ్యత..
మిలిటరీ గ్రేడ్ షాక్ టెస్ట్‌ను పాస్ చేసిన ప్రపంచంలోనే తొలి 10,000mAh+ బ్యాటరీ ఫోన్ ఇదేనని కంపెనీ వెల్లడించింది. TÜV Rheinland 5-Star బ్యాటరీ సర్టిఫికేషన్ కూడా ఉంది. 4 సంవత్సరాల తర్వాత కూడా 80% బ్యాటరీ సామర్థ్యం ఉంటుందని realme హామీ ఇచ్చింది. ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, IR సెన్సార్, IP66 + IP68 + IP69 డస్ట్ & వాటర్ రెసిస్టెన్స్, Wi-Fi 6, Bluetooth 5.2, డ్యూయల్ 5G SA/NSA సపోర్ట్, బరువు: 219 గ్రాములు (భారీ బ్యాటరీ ఉన్నా స్లిమ్ డిజైన్) వంటి ఇతర ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.
ధర వివరాలు..
- ఈ ఫోన్‌కు చెందిన 8GB + 128GB మోడల్ ధర రూ. 25,999 ఉండగా, బ్యాంక్/ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో: రూ.23,999 కు పొందవచ్చు. అదనంగా 6 నెలల నో కాస్ట్ EMI, 4 సంవత్సరాల బ్యాటరీ వారంటీ (రూ.2,999 విలువ), ఫస్ట్ సేల్‌లో మాత్రమే అందిస్తున్నారు.
- 8GB + 256GB మోడల్ ధర రూ.25,999 (ఆఫర్‌తో) ఉండగా, 12GB + 256GB మోడల్ ధర రూ.28,999 (ఆఫర్‌తో)గా ఉంది.
- ఫస్ట్ సేల్: ఫిబ్రవరి 5, మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫిబ్రవరి 7, రాత్రి 11:59 వరకు.
- realme.com, ఫ్లిప్‌కార్ట్, ఆఫ్‌లైన్ స్టోర్లలో విక్రయాలు జరగనున్నాయి.








