ప‌బ్‌జి ప్రియులకు గుడ్ న్యూస్‌..!

May 6, 2021 11:06 AM

చైనాతో నెల‌కొన్న స‌రిహ‌ద్దు వివాదం నేప‌థ్యంలో గ‌తేడాది భార‌త ప్ర‌భుత్వం ప‌లు చైనా యాప్‌ల‌తోపాటు ప‌బ్‌జి మొబైల్ గేమ్‌ను బ్యాన్ చేసిన సంగ‌తి తెలిసిందే. దీంతో ప‌బ్‌జి మొబైల్ ఇండియాగా ఆ గేమ్‌కు నామ‌క‌ర‌ణం చేసి డెవ‌ల‌ప‌ర్లు గేమ్‌ను మ‌ళ్లీ భార‌త్‌లో లాంచ్ చేసేందుకు య‌త్నించారు. అయిన‌ప్ప‌టికీ వారి ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌లేదు. అయితే త్వ‌ర‌లో ఈ గేమ్ మ‌ళ్లీ లాంచ్ అవ‌బోతున్న‌ట్లు తెలిసింది.

pubg mobile india may launch soon in india

ప‌బ్‌జి మొబైల్ ఇండియా గేమ్‌కు క్రాఫ్ట‌న్ సంస్థ బ్యాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియాగా పేరు మార్చింది. దీని పేరిట ఏప్రిల్ 7వ తేదీన ఓ వెబ్‌సైట్‌ను కూడా రిజిస్ట‌ర్ చేసింది. అలాగే గేమ్‌కు సంబంధించి ప‌లు ఇమేజ్‌లు లీక‌య్యాయి. దీంతోపాటు భార‌త్ నుంచి ఉద్యోగుల‌ను కూడా రిక్రూట్ చేసుకుంటున్నారు. దీన్ని బ‌ట్టి చూస్తే గేమ్‌ను త్వ‌ర‌లోనే లాంచ్ చేస్తారని అర్థ‌మ‌వుతోంది.

అయితే గేమ్ లాంచింగ్ తేదీ గురించి ఇప్ప‌టి వ‌ర‌కు ఆ సంస్థ అధికారికంగా ఎలాంటి ప్ర‌క‌ట‌నా చేయ‌క‌పోయినా ఈ గేమ్‌ను ఇదే నెల లేదా జూన్ నెల‌లో లాంచ్ చేస్తార‌ని తెలుస్తోంది. ఇక ఈ కొత్త గేమ్‌కు కేంద్రం అనుమ‌తులు ఇస్తుందా, గేమ్ లాంచ్ అవుతుందా ? అనేది వేచి చూస్తే తెలుస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment