మొబైల్స్ తయారీదారు షియోమీ కొత్తగా ఎంఐ నోట్ బుక్ ప్రొ, ఎంఐ నోట్‌బుక్ అల్ట్రా పేరిట రెండు నూతన ల్యాప్‌టాప్‌లను భారత్‌లో విడుదల చేసింది. వీటిల్లో ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఎంఐ నోట్ బుక్ ప్రొ ల్యాప్‌టాప్‌లో.. 14 ఇంచుల డిస్‌ప్లే ఉంది. దీనికి 2560 × 1600 పిక్సల్స్ రిజల్యూషన్ లభిస్తుంది. ఇంటెల్ 11వ జనరేషన్ కోర్ ఐ7, ఐ5 ప్రాసెసర్ ఆప్షన్లను ఇందులో అందిస్తున్నారు. 8/16 జీబీ ర్యామ్, 512 జీబీ ఎస్ఎస్‌డీ, విండోస్ 10 హోమ్, హెచ్‌డీ వెబ్‌క్యామ్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, బ్లూటూత్ 5.1, యూఎస్‌బీ టైప్ సీ, డీటీఎస్ ఆడియో ఫీచర్లు లభిస్తున్నాయి. కేవలం 34 నిమిషాల్లోనే 50 శాతం వరకు చార్జింగ్ అవుతుంది. 11 గంటల వరకు వీడియోలను చూడవచ్చు.
ఎంఐ నోట్ బుక్ అల్ట్రా ల్యాప్‌టాప్‌లో.. 15.6 ఇంచుల డిస్‌ప్లే ఉంది. 3200 × 2000 పిక్సల్స్ రిజల్యూషన్ లభిస్తుంది. డిస్‌ప్లేకు 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ ఉంది. అందువల్ల డిస్‌ప్లే క్వాలిటీగా ఉంటుంది. ఇంటెల్ 11వ జనరేషన్ కోర్ ఐ7, ఐ5 ప్రాసెసర్ ఆప్షన్లు లభిస్తున్నాయి. 8/16 జీబీ ర్యామ్, 512 జీబీ ఎస్ఎస్‌డీ, విండోస్ 10 హోమ్, హెచ్‌డీ వెబ్ క్యామ్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, బ్లూటూత్ 5.1, యూఎస్‌బీ టైప్ సి, డీటీఎస్ ఆడియో ఫీచర్లు ఇందులో లభిస్తున్నాయి. కేవలం 45 నిమిషాల్లోనే 50 శాతం చార్జింగ్ అవుతుంది. 12 గంటల వరకు వీడియోలను చూడవచ్చు.
ఈ ల్యాప్‌టాప్‌లను ఎంఐ ఆన్‌లైన్ స్టోర్‌తోపాటు ఎంఐ హోమ్ స్టోర్స్, అమెజాన్, రిటెయిల్ స్టోర్స్ లో ఆగస్టు 31వ తేదీ నుంచి కొనుగోలు చేయవచ్చు. హెచ్‌డీఎఫ్‌సీ కార్డులతో రూ.4500 వరకు డిస్కౌంట్ పొందవచ్చు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…